Sonu Sood : చిరు వ్యాపారులకు ఫ్రీ ప్రొమోషన్ చేస్తున్న రియల్ హీరో

కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనుసూద్.. ఇప్పుడు చిరు వ్యాపారులపై దృష్టిపెట్టారు.

Sonu Sood : చిరు వ్యాపారులకు ఫ్రీ ప్రొమోషన్ చేస్తున్న రియల్ హీరో

Sonu Sood

Updated On : August 23, 2021 / 7:54 PM IST

Sonu Sood : కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనుసూద్.. ఇప్పుడు చిరు వ్యాపారులపై దృష్టిపెట్టారు. కరోనా కష్టకాలంలో వ్యాపారాలు లేక తీవ్రంగా నష్టపోయారు చిరు వ్యాపారులు. కొందరు కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఇంకొందరు అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇక ఇప్పుడిప్పుడే వ్యాపారాలు గాడినపడ్డాయి దీంతో చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను ప్రారంభించారు. వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో రియల్ హీరో సోనుసూద్ ఫ్రీ ప్రొమోషన్ చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారుల దగ్గరకు వెళ్లి వారి ప్రోడక్ట్ ప్రొమోషన్ చేస్తున్నారు.

రహదారుల వెంట దుకాణాలు నడుపుకునే చిరు వ్యాపారులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. షూటింగ్ జరిగే ప్రాంతంలో ఉండే వీధి వ్యాపారులతో మాట్లాడుతున్నారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్ తదితర తినుబంఢారాలను పెట్టుకొని అమ్మడం ఆ త‌ర్వాత పంజాబీ దాబా ద్వారా తందూరి రొట్టెలు అమ్మడం , జ్యూస్ స్టాల్‌లో జ్యూస్ అమ్మ‌డం, చెప్పుల‌ను కొనుక్కోమ‌నని చెప్ప‌డం ద్వారా చిరు వ్యాపారుల‌కి అండ‌గా నిలుస్తున్నాడు.

తాజాగా మొక్క‌జొన్న పొత్తుల వారిని ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చాడు. వ‌ర్షా కాలంలో మొక్క‌జొన్న‌ల‌కు మంచిగిరాకీ ఉంటుంద‌ని చెప్పిన సోనూ..వాటిని కాలుస్తూ ధ‌ర‌లు అడిగి తెలుసుకున్నాడు. సోను ప్రొమోషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీధి వ్యాపారుల‌ని సపోర్ట్‌ చేస్తూ సోను చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)