Sonu Sood : సెట్‌లో కంటతడి పెట్టిన సోనూసూద్
రియల్ హీరో సోనూసూద్ కంటతడిపెట్టారు. ఓ సాంగ్ చిత్రీకరణ సమయంలో భావోద్వేగానికి గురైన సోనూ ఆ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తాను కన్నీరు పెట్టడానికి గల కారణాన్ని వివరించారు.

Sonu Sood
Sonu Sood : కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరో అయ్యారు సోను సూద్.. కష్టకాలంలో మానవత్వం చాటుకున్న సోను.. సెట్‌లో కంటతడి పెట్టారు. అయితే సోను కంటతడి పెట్టడం వెనుక పెద్ద కారణమే ఉందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫరాఖాన్ దర్శకత్వంలో సోనూసూద్, నిధీ అగర్వాల్ జంటగా ‘సాత్ క్యా నిభావోగే’ తెరకెక్కించారు. 1990 నాటి ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ గీతాన్ని రీక్రియేట్ చేశారు. తొంభైలలో అల్తాఫ్ రాజా పాడిన సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇది. ఈ పాటను టోనీ కక్కర్ రచించి అల్లాఫ్‌రాజ్‌తో కలిసి ఆలపించాడు. ఆగస్టు 9న ఈ పాట విడుదలైంది.
ఈ సాంగ్ మేకింగ్ వీడియోను సోనూసూద్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో హీరోయిన్ కూర్చున కెమెరా ట్రాలీ లాగుతూ కనిపించారు సోనూసూద్. ఇక ఈ వీడియో గురించి చెబుతూ ‘ఓ హిట్ సాంగ్ తీయాలంటే ఎంతో కష్టపడాలి’ అంటూ కంట తడిపెట్టుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram