ఇండియన్ స్టూడెంట్స్ కోసం సోనూ మరో రెండు విమానాలు

  • Publish Date - August 13, 2020 / 08:11 AM IST

కరోనా టైంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను వారి సొంతింటికి చేరుకొనేలా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రయత్నిస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో చిక్కుకున్న స్టూడెంట్స్ ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు మరో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

మీ కుటుంబాలను కలుసుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నానని, మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 7.10 గంటలకు SG 9286 నెంబర్ గల విమానం బయలుదేరుతుందని తెలిపారు. ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చాలని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.


కజకిస్తాన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సోనూ సూద్.
కజకిస్తాన్ లో చిక్కుకున్న విద్యార్థులు బ్యాగులు సర్దుకోవాలని సూచించారు. SG 9520 నెంబర్ గల విమానం 14వ తేదీ ఆగస్టు 2.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. వారి వారి కుటుంబసభ్యులను కలుసుకోవాలని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.