#BB3: బాలయ్యకు విలన్‌గా రియల్ హీరో!..

  • Publish Date - October 1, 2020 / 08:39 PM IST

Balayya – Sonu Sood: నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ ఫిల్మ్.. BB3(వర్కింగ్ టైటిల్)..ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. కానీ నిత్యం ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తుందీ చిత్రం.. అందుకు కారణం.. బాలయ్య పుట్టినరోజుకి రిలీజ్ చేసిన #BB3 First Roar వీడియో..


అయితే బాలయ్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. విలన్ పాత్రకు సంబంధించి సీనియర్ నటి జయప్రద, రోజాల పేర్లు వినిపించాయి.. కానీ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. కట్ చేస్తే ఇప్పుడు బాలయ్యకు ప్రతినాయకుణ్ణి ఫిక్స్ చేసేశారు.


కరోనా కష్టకాలంలో పలు సేవా కార్యక్రమాలు చేసి అందరిచేత రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించనున్నారట. ఇంతకుముందు బాలయ్యతో ‘ఊ.. కొడతారా.. ఉలిక్కి పడతారా..’’ చిత్రంలో నటించి మెప్పించిన సోనూ సూద్ ఇప్పుడు బాలయ్య, బోయపాటిల సినిమాలో పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.


నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటలు : ఎం.రత్నం, సంగీతం : తమన్, కెమెరా : సి.రామ్ ప్రసాద్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి.