Sonu Sood : రియల్ హీరోకి పెట్స్ అంటే ఎంత ప్రేమో చూశారా..

సోనూ సూద్ పెట్స్‌తో సరదాగా గడుపుతున్న పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

Sonu Sood

Sonu Sood: సోనూ సూద్.. భారతీయులకి, ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. పక్కవాడికి ప్రాబ్లమ్ వస్తే పట్టించుకోని ఈ రోజుల్లో.. అందులోనూ మహమ్మారి కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, అవసరం ఉన్న వారికి ఎన్ని రకాలుగా సాయం చేశారో వాటి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.

Sonu Sood : దుర్గమ్మ సన్నిధిలో సోనూ సూద్..

సాయం పొందిన వారి పాలిట దేవుడిగా మారిపోయారాయన. ఆపదలో ఆదుకున్న ఆపద్భాందవుడికి గుడి కట్టేసి అభిమానాన్ని చాటుకున్నారు. కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చేశారు. తన సొంత డబ్బుతో ఇప్పటికీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు సోనూ సూద్.

Sonu Ki Supermarket : సోనూ సూద్ సూపర్ మార్కెట్ ఎలా ఉందో చూశారా..!

ఎప్పుడూ ఏదో ఒక సేవా కార్యక్రమంతో మీడియాలో కనిపించే సోనూ రీసెంట్‌గా తన పెట్స్‌తో సరదాగా గడుపుతున్న పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Persian Cat, Beagle Breed Dog తో ఉన్నారాయన. ‘మీ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ బాగుంది. పెట్స్ భలే క్యూట్‌గా ఉన్నాయి.. మీకు అవంటే ఎంత ప్రేమో పిక్స్ చూస్తే తెలుస్తుంది’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

‘ఎవరికైనా ఫ్రెష్ మిల్క్ కావాలా?’ అంటూ నాలుగు రోజుల క్రితం ఆవుతో ఉన్న పిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సోనూ సూద్.. ‘ఊరికే’ అంటూ Persian Cat, Beagle Breed Dog ఫొటో పోస్ట్ చేశారు. ఈ పిక్చర్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.