Sonu Sood : దుర్గమ్మ సన్నిధిలో సోనూ సూద్..

కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలుస్తున్న ‘రియల్ హీరో’ సోనూ సూద్ విజయవాడ కనకదుర్మమ్మ వారిని దర్శించుకున్నారు..

Sonu Sood : దుర్గమ్మ సన్నిధిలో సోనూ సూద్..

Sonu Sood

Updated On : September 9, 2021 / 3:33 PM IST

Sonu Sood: రియల్ హీరో సోనూ సూద్ విజయవాడలో సందడి చేశారు. గురువారం ఆయన ఇంద్రకీలాద్రిలో కొలువైఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సోనూ సూద్ కోసం ఆలయ అధికారులు, పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Sonu Sood

వేదామంత్రాలతో అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రియల్ హీరోను చూడ్డానికి జనం పోటెత్తారు. సెల్ఫీ కోసం పోటీపడ్డారు. సోనూకి ఆలయ అధికారులు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందచేశారు.

Sonu Sood

‘దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరినీ చల్లగా కాపాడాలని దుర్గమ్మను కొరుకున్నా’ని చెప్పారు సోనూ సూద్.

Sonu Sood : చిన్నారికి ‘రియల్ హీరో’ సోనూ సూద్ పేరు.. ఎందుకో తెలుసా..!