Sonu Ki Supermarket : సోనూ సూద్ సూపర్ మార్కెట్ ఎలా ఉందో చూశారా..!

సోనూ సూద్ సూపర్ మార్కెట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Sonu Ki Supermarket : సోనూ సూద్ సూపర్ మార్కెట్ ఎలా ఉందో చూశారా..!

Sonu Ki Supermarket

Updated On : June 24, 2021 / 12:58 PM IST

Sonu Ki Supermarket: ఈ కరోనా కష్టకాలంలో ఎందరినో ఎన్నో రకాలుగా ఆదుకుంటున్న ‘రియల్ హీరో’ సోనూ సూద్ ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. నిజంగా అవసరం ఉన్నవారికి, ఆపదలో ఉన్న వారికి సాయమందిస్తూ.. వింత కోరికలు కోరే వారికి ఫన్నీగా ఆన్సర్ ఇస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు సోనూ.

Sonu Sood: సోనూభాయ్ నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతుంది.. హెల్ప్ చేస్తారా?

రీసెంట్‌గా ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతుందని, ఏమైనా హెల్ప్ చేస్తారా అని సోనూ సూద్‌ను అడగ్గా.. ‘అది అవుతుందో లేదో కానీ ఐఫోన్ కొనిస్తే నీ దగ్గర మాత్రం ఏదీ మిగలదు’ అంటూ ఆయన ఇచ్చిన రిప్లై ట్వీట్ వైరల్‌గా మారింది.

ఇప్పుడు సోనూ సూద్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. వాటి రేట్లు చెప్తూ గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్ముతున్నారు. డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది.. దానికి ఎక్స్‌ట్రా ఛార్జ్ అవుతుంది.. త్వరగా ఆర్డర్ చెయ్యండి అంటూ సోనూ సూద్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Sonu Sood : చిన్నారికి ‘రియల్ హీరో’ సోనూ సూద్ పేరు.. ఎందుకో తెలుసా..!

సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి – కొరటాల కాంబోలో వస్తున్న‘ఆచార్య’ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సోనూ సూద్.. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్’ లోనూ కీ క్యారెక్టర్ చేస్తున్నారు.