Sonu Sood: సోనూభాయ్ నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతుంది.. హెల్ప్ చేస్తారా?

కరోనా లాక్‌డౌన్‌లో అడిగిన వారికి కాదనకుండా సాయం చేసి దేవుడిగా మారిన సోనూసూద్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లు కూడా నెలకొల్పే ప్రయత్నాలలో ఉన్నాడు. కరోనా సమయంలో ఆదుకోవడమే కాదు.. ఆపద ఎలాంటిదైనా తన దృష్టికి తీసుకెళ్తే తప్పక నెరవేరుస్తాడని పేరు తెచ్చుకున్నాడు.

Sonu Sood: సోనూభాయ్ నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతుంది.. హెల్ప్ చేస్తారా?

Sonusood Iphone

Sonu Sood: కరోనా లాక్‌డౌన్‌లో అడిగిన వారికి కాదనకుండా సాయం చేసి దేవుడిగా మారిన సోనూసూద్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లు కూడా నెలకొల్పే ప్రయత్నాలలో ఉన్నాడు. కరోనా సమయంలో ఆదుకోవడమే కాదు.. ఆపద ఎలాంటిదైనా తన దృష్టికి తీసుకెళ్తే తప్పక నెరవేరుస్తాడని పేరు తెచ్చుకున్నాడు. కాగా అలాంటి సోనూను అప్పుడప్పుడు కొందరు తింగరి కోరికలు కోరుతూ రిక్వెస్టులు పెడుతుంటారు.

టైంపాస్ కోసం సిల్లీ కోరికలు కోరుతూ పెట్టే వాటికి కూడా సోనూసూద్ క్రేజీగానే సమాధానం ఇస్తుంటారు. తాజాగా ఓ యూజర్ ‘భాయ్.. నా గర్ల్ ఫ్రెండ్ ఐఫోన్ కొనివ్వమని అడుగుతుంది. మీరు ఏమైనా సాయం చేస్తారా’ అని అడిగాడు.. దీనికి సోనూసూద్ స్పందించారు. ‘అది అవుతుందో లేదో కానీ ఐఫోన్ కొనిస్తే నీ దగ్గర మాత్రం ఏదీ మిగలదు’ అంటూ సోనూసూద్ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

కరోనా లాంటి విపత్కర పరిస్థితి నుండి.. చదువుల కోసం.. ఆన్లైన్ క్లాసులకు ఇబ్బంది తలెత్తిన వారికి సెల్ ఫోన్స్ నుండి సెల్ టవర్స్ వరకు నెలకొల్పిన సోనూసూద్ ను ఇప్పటికీ చాలా మంది సాయం కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే కొంత మంది సోనూసూద్ సాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరికొంతమంది అవసరం సిల్లీ అని తెలిసినా తనను గొంతిమకోర్కెలు కోరుతుంటే.. సోనూ మాత్రం అదే స్థాయిలో కౌంటర్ రిప్లై ఇస్తుంటే నెటిజన్లు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు.