Mandaadi : విలన్ గా సుహాస్.. సముద్రంలో బోట్ రేసింగ్.. మండాడి సినిమాపై అంచనాలు..
ఈ సినిమా అంతా సముద్ర తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో, బోట్ రేసింగ్ అంశాలతో సాగనుంది. (Mandaadi)
Mandaadi
Mandaadi : తమిళ్ స్టార్ కమెడియన్ సూరి, తెలుగు నటుడు సుహాస్ కలిసి నటిస్తున్న సినిమా ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మన సుహాస్ తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తూనే మెయిన్ విలన్ గా చేస్తుండటంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా అంతా సముద్ర తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో, బోట్ రేసింగ్ అంశాలతో సాగనుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మాణంలో మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సముద్రంలో బోట్ రేస్ తో పాటు, సవాళ్లతో కూడిన యాక్షన్ సీన్స్ ఉండగా వాటిని చాలా జాగ్రత్తగా గత కొన్ని రోజుల నుంచి షూట్ చేసి పూర్తి చేసారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సన్నివేశాలు ఉండబోతున్నాయి.
Also Read : Krithi Shetty : పచ్చని చిలుకలా.. ఆకుపచ్చని చీరలో కృతిశెట్టి పరువాలు..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ప్రారంభించారు. సూరి, సుహాస్‌లు ఇద్దరూ ఈ సినిమాలో పాత్రల కోసం తమ శరీరాకృతిని, లుక్స్‌ను మార్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుహాస్ ఏకంగా వంద రోజుల్ని కేటాయించారు. షూటింగ్ లో గాయాలు కూడా అయ్యాయని ఇటీవల తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కానుంది.

