Nayanthara : కొడుకుకి పాదసేవ చేసుకుంటున్న నయనతార.. లేడీ సూపర్ స్టార్ అయినా అమ్మే కదా..

ప్రస్తుతం నయనతార తన మదర్‌హుడ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. కొడుకులతో కలిసి మంచి సమయం గడుపుతుంది. తాజాగా నయన్ ఒక వీడియోని షేర్ చేసింది.

Nayanthara : కొడుకుకి పాదసేవ చేసుకుంటున్న నయనతార.. లేడీ సూపర్ స్టార్ అయినా అమ్మే కదా..

South star heroine Nayanthara cute video with her son Uyir

Updated On : October 20, 2023 / 8:00 AM IST

Nayanthara : సౌత్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ సంవత్సరం క్రితం సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక వారికి ఉయర్ రుద్రో నీల్, ఉలగ్ దైవిక్ అనే పేర్లు పెట్టారు. మొన్నటి వరకు ఆ పిల్లల పేస్ ని అభిమానులకు చూపించకుండా జాగ్రత్తపడిన నయన్ దంపతులు.. ఇటీవల వారి పేస్‌లని అందరికి రివీల్ చేశారు. ఆ క్యూట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం నయనతార తన మదర్‌హుడ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. కొడుకులతో కలిసి మంచి సమయం గడుపుతుంది. తాజాగా నయన్ ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో నయనతార.. ఆడుకొని కష్టపడిన తన కొడుకు చిన్న పాదాలకు సేవ చేస్తూ కనిపిస్తుంది. బుడ్డోడి బుల్లి పదాలను నయన్ ఒత్తుతుంటే.. అమ్మ ఒడిలో హాయిగా రిలాక్స్ అవుతూ నయన్ వారసుడు ఉయర్ రుద్రో నీల్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. ‘లేడీ సూపర్ స్టార్ అయినా అమ్మే కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Prabhas : ఫ్యాన్స్‌కి ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ రెడీ.. గెట్ రెడీ రెబల్స్..

ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే జవాన్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుంది. ప్రస్తుతం తమిళంలోనే మూడు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. వీటిలో నయన్ మైల్ స్టోన్ మూవీ 75వ చిత్రం కూడా ఉంది. ఇక తెలుగులో మంచి విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఒక ముఖ్య పాత్ర చేయబోతుందట. గతంలో ప్రభాస్, నయన్.. యోగి సినిమాలో కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో కలిసి కనిపించబోతున్నారు.