Sowmya Menon : ‘సర’ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్‌తో ఆకట్టుకోబోతున్న.. మలయాళీ భామ సౌమ్య మీనన్

సర్కారివారిపాట సినిమాలో కనిపించింది కాసేపైనా అందరి లుక్స్ ని గ్రాబ్ చేసిన ఈ మాలివుడ్ బ్యూటీ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చింది.

Sowmya Menon : ‘సర’ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్‌తో ఆకట్టుకోబోతున్న.. మలయాళీ భామ సౌమ్య మీనన్

Sowmya Menon Malayali Actress coming with Female Oriented Movie Sara

Updated On : August 7, 2023 / 11:52 AM IST

Sowmya Menon : యూత్‌ను ఎట్రాక్ట్ చేసే క‌ళ్లు.. ఎవ‌రినైనా ఆకట్టుకునే స్మైల్.. గ్లామ‌ర్ ప్ల‌స్ యాక్టింగ్‌తో సినిమాల్లోకి దూసుకువ‌చ్చిన హీరోయిన్.. సౌమ్య మీనన్ (sowmya menon ). అప్పటికే హీరోయిన్, కానీ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి తన ప‌క్కన యాక్ట్ చేయాలనే కోరికతో ‘సర్కారివారిపాట’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది ఈ అందాల సుంద‌రి.

సర్కారివారిపాట సినిమాలో కనిపించింది కాసేపైనా అందరి లుక్స్ ని గ్రాబ్ చేసిన ఈ మాలివుడ్ బ్యూటీ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చింది. శ్రీ వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీవత్స క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘సర’ (SARA)లో సౌమ్య మీనన్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్టు మేకర్స్ చెప్తూ, ఈ మూవీ ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో కనిపించని బ్యాక్ డ్రాప్‌లో వి.శశిభూషణ రైటింగ్ అండ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్నట్టు చెప్పారు. మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టెక్నీషియన్స్ పేర్లన్నీ త్వరలోనే రివీల్ చేస్తామన్నారు.

మలయాళంలో కినవల్లి, ఫ్యాన్సీ డ్రెస్, చిల్డ్రన్స్ పార్క్.. లాంటి సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా చేసింది సౌమ్య. ప్రస్తుతం సౌమ్య చేతిలో ఒక కన్నడ సినిమా, రెండు మలయాళ సినిమాలు, తెలుగు సినిమా ఉంది. అయితే.. తెలుగులో ట్యాక్సీ అనే సినిమా చేసింది. కానీ దానికంటే ముందే సర్కారు వారి పాట రిలీజ్ అయ్యేసరికి అందరి దృష్టిలో పడింది. అదీగాక సౌమ్య నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. కొన్ని మలయాళీ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఆడిపాడింది.

The Elephant Whisperers : ఆస్కార్ విన్నర్ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బొమ్మన్ & బెల్లి.. 2 కోట్లు కోరుతూ లీగల్ నోటిస్ కూడా..

కట్టిపడేసే అందంతో, ఆక‌ర్ష‌ణీయ‌మైన లుక్కుతో సౌమ్య మీనన్ లేడీ ఒరియంటెడ్ మూవీ చేయ‌డం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ‘సర’లో గ్యారెంటీగా మూవీ లవర్స్‌ని అలరిస్తుందని ఆశిస్తున్నారు.