SP Sailaja – Subhalekha Sudhakar : ఉదయాన్నే లేవగానే నిశ్చితార్థం అని చెప్పి.. sp శైలజ, శుభలేఖ సుధాకర్ ఎలా ఒక్కటయ్యారో తెలుసా?
తాజాగా ఎస్పీ శైలజ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో తమ నిశ్చితార్థం గురించి ఆసక్తికర విషయం తెలిపింది. (SP Sailaja - Subhalekha Sudhakar)
SP Sailaja - Subhalekha Sudhakar
SP Sailaja – Subhalekha Sudhakar : సింగర్ SP శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్ భార్యాభర్తలు అని తెలిసిందే. SP శైలజ దివంగత, లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు చెల్లి అని అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా SP శైలజ, శుభలేఖ సుధాకర్ సినిమాలతో బిజీగానే ఉన్నారు. శైలజ పలు టీవీ షోలలో కూడా జడ్జిగా కనిపిస్తూ అలరిస్తున్నారు.
తాజాగా ఎస్పీ శైలజ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో తమ నిశ్చితార్థం గురించి ఆసక్తికర విషయం తెలిపింది.
Also Read : Toxic : ‘పెద్దవాళ్లకు’ మాత్రమే.. టాక్సిక్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
ఎస్పీ శైలజ మాట్లాడుతూ.. నాకు అమెరికా సంబంధాలు వచ్చేవి. నేను చేసుకోను అని చెప్పేదాన్ని. నేను ఒకటే కండిషన్ పెట్టాను. నేను అమెరికా, వేరే దేశానికి వెళ్ళను. ఇక్కడ చూడండి. అన్నయ్యకు దగ్గరగా ఉండాలి, చెన్నైలోనే ఉండాలి అని చెప్పాను. చాలా సంబంధాలు చూసారు. శుభలేఖ సుధాకర్ ని కూడా చూసొద్దాం అని అమ్మ, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి చూసొచ్చారు. తర్వాత దాని గురించి నాకేమి చెప్పలేదు.
ఒక రోజు పొద్దున్నే నిద్రలేపి ఇవాళ నీ నిశ్చితార్థం అని అన్నారు. నేను షాక్. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అని కోపం వచ్చింది. ఆ రోజంతా కోపంగానే ఉన్నాను. నిశ్చితార్థం జరిగింది. ఆయన మంచోడే. అమ్మ, అన్న చూశారంటే వంక పెట్టడానికి ఉండదు. కానీ నాకు ముందే చెప్పాలి కదా అని కోపం. తర్వాత ఆయనకు కూడా ఆ రోజు పొద్దున్నే ఇవాళే నిశ్చితార్థం అని చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత మా పెళ్లి జరిగింది అని తెలిపారు.
ఇక ఈ జంటకు శ్రీకర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను చెన్నైలోనే మీడియా రంగంలో జాబ్ చేస్తున్నట్టు తెలిపారు శైలజ.
