Tollywood : టాలీవుడ్ కు సినిమా కష్టాలు..! రేవంత్ సర్కార్ నిర్ణయంతో పెద్ద హీరోల సినిమాలకు ఇబ్బందులు తప్పవా?

టాలీవుడ్ లో ఇకపై ఏం జరగబోతోంది? రాబోయే సంక్రాంతి పందెం కోళ్లకు ఇబ్బందులు తప్పవా?

Tollywood : తెలుగు సినిమాకు సినిమా కష్టాలు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీరియస్ గా ఉన్న తెలంగాణ సర్కార్.. సంచలన నిర్ణయం తీసుకుంది. తాను పదవిలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో టాలీవుడ్ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. ఇప్పుడు టాలీవుడ్ దారెటు? తెలంగాణ సర్కార్ నిర్ణయం టాలీవుడ్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? పెద్ద సినిమాల హీరోలకు ఇక చుక్కలేనా?

పుష్ప 2 బెనిఫిట్ షో వ్యవహారం రాజకీయ రచ్చ రేపుతోంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. అసెంబ్లీ సాక్షిగా సినిమా మీద, హీరో మీద నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రెస్ మీట్ పెట్టి మరీ బన్నీ రియాక్ట్ అయ్యారు. కట్ చేస్తే, ఇదిప్పుడు రాజకీయ రచ్చకు కారణం అవుతోంది.

అయితే, బెనిఫిట్ షో రోజు ఓ నిండు ప్రాణం బలవడంపై ఎమోషనల్ అయిన సీఎం రేవంత్.. అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వము అని ఆయన తేల్చేశారు. సినిమా హిండస్ట్రీ కారణంగా ఓ ప్రాణం పోయిందని, తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీకి ఎలాంటి ప్రత్యేకమైన రాయితీలు కల్పించేది లేదని తేల్చి చెప్పేశారు.

తగ్గితే తప్పేమీ లేదు బ్రదర్.. రేవంత్ సర్కార్ నిర్ణయంతో టాలీవుడ్ హీరోల మీద జరుగుతున్న చర్చ ఇది. వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు తీసుకుంటున్న పెద్ద హీరోలు.. ఇకపై తగ్గాల్సిందేనా? తగ్గకపోతే తప్పు చేసినట్లే అవుతారా? టాలీవుడ్ లో ఇకపై ఏం జరగబోతోంది? రాబోయే సంక్రాంతి పందెం కోళ్లకు ఇబ్బందులు తప్పవా? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో వినిపిస్తున్న చర్చ ఏంటి?

పూర్తి వివరాలు..

Also Read : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పోలీసులకు కీలక ఆదేశాలు