Pawan Kalyan Skit : పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై.. ఆ షోలో పిల్లలు వేసిన స్కిట్ చూశారా? అదిరిపోయిందిగా..

తాజాగా డ్రామా జూనియర్స్ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రపై పిల్లలతో స్పెషల్ స్కిట్ వేయించారు.

Pawan Kalyan Skit : పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై.. ఆ షోలో పిల్లలు వేసిన స్కిట్ చూశారా? అదిరిపోయిందిగా..

Special Skit on Pawan Kalyan in Drama Juniors Video goes Viral

Pawan Kalyan Skit : ఇటీవల ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ భారీ గెలుపు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ జీవితం గురించి అందరికి తెలిసిందే. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగి ఆ తర్వాత జనాల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ గెలుపు తర్వాత అనేకమంది సినీ సెలబ్రిటీలు పవన్ ని అభినందించారు. పలు టీవీ షోలలో పవన్ గురించి మాట్లాడారు.

తాజాగా డ్రామా జూనియర్స్ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రపై రైజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనే పేరుతో పిల్లలతో స్పెషల్ స్కిట్ వేయించారు. ఈ స్కిట్ లో.. చిరంజీవితో మొదలు పెట్టి కళ్యాణ్ బాబు ఎలా సినీ పరిశ్రమలోకి వచ్చాడు, చిరంజీవి భార్య పవన్ కళ్యాణ్ ని హీరో అవ్వమని ఎలా ప్రోత్సహించింది, నాగబాబు సినిమాల్లో నష్టపోయినప్పుడు పవన్ ఎలా సపోర్ట్ చేసాడు, పవన్ ఎలా రాజకీయాల్లోకి వచ్చాడు, ఎలా గెలిచాడు అని అద్భుతంగా చూపించారు.

Also Read : Mokksha – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హవా బెంగాల్‌లో కూడా.. పవన్ గురించి ఈ బెంగాలీ హీరోయిన్ ఏం చెప్పిందంటే..

పవన్ గెలిచాక చిరంజీవి ఇంటికి వెళ్లిన ఎమోషనల్ సన్నివేశాన్ని కూడా ఈ స్కిట్ లో రీ క్రియేట్ చేసారు. ఈ ఎపిసోడ్ కి నిహారిక కూడా గెస్ట్ గా రావడంతో స్కిట్ చూసి ఎమోషనల్ అయింది. దీంతో ఈ స్కిట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. పవన్ జీవిత చరిత్రపై ఇలా పిల్లలు స్కిట్ చేయడాన్ని అభిమానులు అభినందిస్తున్నారు. మీరు కూడా ఈ స్కిట్ చూసేయండి..