Spider-Man: 10 వేల కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్!

హాలీవుడ్ రికార్డులు తిరగరాస్తున్నాడు స్పైడర్ మ్యాన్. వందలకోట్లుకాదు.. వేలకోట్ల కలెక్షన్లతో ప్రపంచాన్ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు ఈ సూపర్ హీరో. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా..

Spider Man

Spider-Man: హాలీవుడ్ రికార్డులు తిరగరాస్తున్నాడు స్పైడర్ మ్యాన్. వందల కోట్లుకాదు.. వేలకోట్ల కలెక్షన్లతో ప్రపంచాన్ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు ఈ సూపర్ హీరో. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా రిలీజ్ అయిన ప్రతి చోటా రికార్డ్ కలెక్షన్లతో 2021లో ప్రపంచలోనే హయ్యస్ట్ గ్రాసింగ్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసిన స్పైడర్ మ్యాన్ ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు. రెండేళ్ల నుంచి అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్న హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రిలీజ్ అయ్యిందో లేదో.. సూపర్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు.

NBK 107: క్రాక్ కాంబినేషన్ రిపీట్.. బాలయ్య కోసం జయమ్మ ఫిక్స్!

డిసెంబర్ 16న రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ 2021 సంవత్సరానికి హయ్యస్ట్ గ్రాసర్ గా 10 వేలకుపైగా కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ గా సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రిలీజ్ కి హాలీవుడ్ లో కాదు.. ఇండియాలోనే భారీగా రికార్డ్ స్తాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇక సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉన్నాడు స్పైడర్ మ్యాన్. మూవీ రిలీజ్ అయిన 12 రోజుల్లోనే అక్షరాలా 1 బిలియన్ .. కలెక్షన్లు సాధించిన స్పైడర్ మ్యాన్ లేటెస్ట్ గా 10 వేల 500 కోట్ల ప్లస్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు.

Atithi Devo Bhava: నానీ చేతుల మీదుగా ఆది ‘అతిధి దేవోభవ’ ట్రైలర్!

2019లో రిలీజ్ అయిన స్టార్ వార్స్ తర్వాత 1 బిలియన్ కలెక్షన్లు సాధించిన సినిమా స్పైడర్ మ్యానే. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు.. 2021 సంవత్సరానికి వరల్డ్ వైడ్ గా హయస్ట్ గ్రాసింగ్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. స్పెషల్లీ ఇండియాలోనే 260 కోట్ల కలెక్షన్లు దాటి హాలీవుడ్ సినిమాలకు సరికొత్త కలెక్షన్ రికార్డ్ సెట్ చేశాడు స్పైడర్ మ్యాన్. పాన్ డమిక్ పీరియడ్ లో రిలీజ్ అయిన ఏ హాలీవుడ్ సినిమా కూడా స్పైడర్ మ్యాన్ బాక్సాఫీస్ కలెక్షన్ల దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. పుష్ప..83 లాంటిస్టార్ స్టడెడ్ మూవీస్ రిలీజ్ అయినా కూడా ఇంకా హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు కంటిన్యూ చేస్తూనే ఉంది.