NBK 107: క్రాక్ కాంబినేషన్ రిపీట్.. బాలయ్య కోసం జయమ్మ ఫిక్స్!

నటసింహా నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఊపులో వరస సినిమాలకి ప్లాన్ చేస్తున్న బాలయ్య ముందుగా ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్..

NBK 107: క్రాక్ కాంబినేషన్ రిపీట్.. బాలయ్య కోసం జయమ్మ ఫిక్స్!

Nbk 107

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఊపులో వరస సినిమాలకి ప్లాన్ చేస్తున్న బాలయ్య ముందుగా ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. నిజానికి ఎప్పుడో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా అఖండ షూటింగ్‌లో బాలయ్యకు గాయం కావడంతో ఆలస్యమైంది.

Atithi Devo Bhava: నానీ చేతుల మీదుగా ఆది ‘అతిధి దేవోభవ’ ట్రైలర్!

ఇప్పటికే ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించగా.. శృతిహాసన్ హీరోయిన్ గా ఎప్పుడో ఫిక్స్ అయింది. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్ర ఉంది. ఈ పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్‌కు మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రకి వరలక్ష్మి పాత్రకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది. దీంతో మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు దర్శకుడు గోపీచంద్.

NTR : ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా??

క్రాక్ హీరోయిన్ శృతిహాసన్, ముఖ్య పాత్రలో నటించిన వరలక్ష్మితో క్రాక్ ను మించి పవర్ ఫుల్ కథలో ఈ ప్రాజెక్టు సిద్దమవుతుంది.రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి ఆధారంగా కథ రాసుకున్న గోపీచంద్ ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్ పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నాడు.