NTR : ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా??

తాజాగా ఎన్టీఆర్ మరో సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం. 'ఉప్పెన' సినిమాతో అందర్నీ మెప్పించిన డైరెక్టర్ బుచ్చి బాబుకి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బుచ్చిబాబు........

NTR : ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా??

Ntr Buchhibabu

NTR :   ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాని కరోనా వల్ల ఈ సినిమా మళ్ళీ వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా టైం కేటాయించాడు. ఈ లోపు ఎన్టీఆర్ కనీసం మూడు సినిమాలైనా చేసి ఉండేవాడు. అందుకే ఇప్పుడు ఫాస్ట్ గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యాక నెక్స్ట్ సినిమా షూట్ మొదలు పెడదాం అనుకున్నాడు కాని కరోనా దెబ్బకి ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా షూట్ వచ్చే నెలలో ప్రారంభించాలని ఫిక్స్ అయిపోయాడట.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా షూట్ ఫిబ్రవరిలో మొదలయ్యే ఛాన్స్ ఉంది. అంతే కాక ‘కెజిఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. ప్రశాంత్ ప్రస్తుతం ‘సలార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. అసలు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ తోనే చేయాలి. కాని ఏమైందో త్రివిక్రమ్ ని పక్కన పెట్టి కొరటాల శివతో చేస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేశాడు.

Pushpa : ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ.. అమెజాన్‌లో సంక్రాంతి కంటే ముందే..

తాజాగా ఎన్టీఆర్ మరో సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం. ‘ఉప్పెన’ సినిమాతో అందర్నీ మెప్పించిన డైరెక్టర్ బుచ్చి బాబుకి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బుచ్చిబాబు చెప్పిన కథ విన్న ఎన్టీఆర్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఎన్టీఆర్ ఒక సినిమా చేశారు. మరో సినిమా చేయబోతున్నారు. బుచ్చిబాబు ‘ఉప్పెన’ కూడా ఈ సంస్థే. దీంతో ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించబోతున్నారు. సినిమాలకి ‘ఆర్ఆర్ఆర్’ వల్ల చాలా గ్యాప్ రావడంతో ఏకకాలంలో కొరటాల శివ, బుచ్చిబాబు సినిమాలని తెరకెక్కించాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్.