Samajavaragamana Trailer : శ్రీవిష్ణు కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన చిరు.. ఫ్యామిలీ సామజవరగమన మాములుగా లేదు!
చిరంజీవి చేతులు మీదుగా శ్రీవిష్ణు కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఫ్యామిలీ సామజవరగమనతో ఈసారి బాగా నవ్వించబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.

Sree Vishnu Samajavaragamana Trailer released by Chiranjeevi
Samajavaragamana Trailer : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu).. ఒక పక్క వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే, మరోపక్క ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్స్ లో కూడా నటిస్తూ మంచి గుర్తింపుని సందించుకున్నాడు. తాజాగా ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమా ‘సామజవరగమన’. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందాయి. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రిలీజ్ చేశారు.
ట్రైలర్ మొత్తం చాలా ఎంటర్టైనర్ గా సాగింది. కథ ఏంటనేది చెప్పనప్పటికీ కామెడీ చూపించి సినిమా పై మంచి ఆసక్తిని కలగజేశారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడిగా రెబా మోనికా జాన్ (Reba Monica John) నటిస్తుంది. హీరోకి తండ్రి పాత్రలో నరేష్ నటిస్తున్నాడు. ఇక వీరి ముగ్గురు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. రామ్ అబ్బరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యింగర్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు.
గోపిసుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు సాంగ్స్ రిలీజ్ కాగా మూడు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. రాజెశ్ దండా ఈ సినిమాని నిర్మిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర ఈ మూవీకి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. జూన్ 29న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Beyond blessed to have you launch our Trailer sir MEGASTAR @KChiruTweets ?
Forever indebted to you for taking out your time for us ??
– https://t.co/6WsNyC9XzT #Samajavaragamana In cinemas from June 29 ✨ pic.twitter.com/VzIO1AwoXE
— Sree Vishnu (@sreevishnuoffl) June 25, 2023