Gaayapadda Simham : ‘గాయపడ్డ సింహం’ ఫస్ట్ రివ్యూ.. తరుణ్ భాస్కర్ కామెడీతో హిట్ కొట్టబోతున్నాడా?
ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. (Gaayapadda Simham)
Gaayapadda Simham
Gaayapadda Simham : తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గాయపడ్డ సింహం. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా, జెడి చక్రవర్తి, విష్ణు ఓఐ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరో శ్రీ విష్ణు ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. టాలీవుడ్ లో కూడా పలువురు సెలబ్రిటీలు, మూవీ యూనిట్ సినిమా చూసినట్టు తెలుస్తుంది. దీంతో గాయపడ్డ సింహం సెన్సార్, టాలీవుడ్ రివ్యూ బయటకు వచ్చింది.
కథ విషయానికి వస్తే.. తరుణ్ భాస్కర్ అమెరికాకి వెళ్ళాలి అనే కలతో చిన్నప్పట్నుంచి బతికే పాత్రలో నటిస్తున్నాడు. మరో వైపు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాన్నకు అమెరికాలో సెటిల్ అయిన అబ్బాయి కావాలని అనడంతో ఎలాగైనా అమెరికాకు వెళ్లాలి అనుకుంటాడు. అమెరికాకు వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకుంటాడు. ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లిన తర్వాత ట్రంప్ తెచ్చిన కొన్ని రూల్స్ తో తరుణ్ భాస్కర్ తో పాటు మరికొంతమందిని కూడా రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు. దాంతో తన లవ్, చిన్నపాటి అమెరికా కోరిక రెండు పోతాయి. కోపంతో తరుణ్ భాస్కర్ ట్రంప్ మీద యుద్ధం చేస్తాను అనుకుంటూ తిరుగుతాడు. అలాంటి సందర్భంలో సత్య(జెడి చక్రవర్తి) రౌడీ గ్యాంగ్ లోకి అనుకోకుండా ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తరుణ్ భాస్కర్ ప్రేమ కథ ఏమైంది? ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడా? శ్రీవిష్ణు గెస్ట్ పాత్రలో వచ్చి ఏం చేస్తాడు? వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే రేపటి దాకా ఎదురుచూడాల్సిందే..
Also Read : Nara Rohith : తండ్రి కాబోతున్న నారా రోహిత్..? శిరీష బేబీ బంప్ ఫోటో వైరల్..
ఈ సినిమాని డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ ఫుల్ లెంగ్త్ కామెడీగా తెరకెక్కించాడు. మన దేశంలో చాలా మంది అమెరికాకు వెళ్ళాలి, అక్కడ డబ్బులు బాగా సంపాదించాలి, అక్కడ లైఫ్ బాగుంటుంది అని కలలు కంటూ ఉంటారు. అలాంటి దానిపై కథ రాసుకున్నారని తెలుస్తుంది. అయితే చివర్లో ఎమోషనల్ టచ్ కూడా ఉండబోతుంది. ట్రంప్ ని బాగా వాడుకున్నారు అని ప్రమోషన్స్, ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. సినిమాలో దీనికి మించి ఉండనుందట. తరుణ్ భాస్కర్ అయితే ఫుల్ గా నవ్విస్తాడట. అమెరికాకు వెళ్ళడానికి రకరకాల గెటప్స్ వేసి ఎయిర్ పోర్ట్ లో వచ్చే సీన్స్ ఫుల్ కామెడీగా వర్కౌట్ అయ్యాయట. సినిమా అంతా సెటైరికల్ కామెడిగానే సాగుతుందని సమాచారం.
సెన్సార్ లో దీనికి యు/ఏ ఇచ్చారు. ఈ సినిమా నిడివి 2 గంటల 20 నిముషాలు ఉంది. ఈ సమ్మర్ లో నవ్వుకోడానికి యూత్. ఫ్యామిలీలు ఈ సినిమాకు వెళ్లొచ్చు. అయితే పాటలు మాత్రం బాగోలేవు అని టాక్. ఇక AI ని కూడా వాడారట సినిమాలో. అమెరికాలో ఉండే తెలుగు వాళ్లకు, అమెరికా వెళ్లాలి అనుకునే వాళ్లకు మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అని అంటున్నారు. మరి గాయపడ్డ సింహం ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో రేపట్నుంచి చూడాలి.
Also Read : Reba Monica John : ప్రగ్నెంట్ అయిన హీరోయిన్.. భర్తతో బేబీ బంప్ ఫోటోషూట్.. ఫొటోలు వైరల్..
