Sreeleela Birthday Celebrations at Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Shoot
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఇటీవల పెండింగ్ లో పెట్టిన సినిమాలన్నీ వరుసగా పూర్తి చేసేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు, OG సినిమాలు షూటింగ్ పూర్తిచేయగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని పూర్తిచేసే పనిలో పడ్డారు పవన్.
కొన్ని రోజుల క్రితం పవన్ ఈ షూట్ లో జాయిన్ అయిన వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల శ్రీలీల పుట్టిన రోజు జరగ్గా నేడు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో శ్రీలీల పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసారు. పవన్ కళ్యాణ్, మూవీ యూనిట్ కలిసి శ్రీలీలతో కేక్ కట్ చేయించి ఆమె పుట్టిన రోజుని సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ పోలీస్ పాత్ర అని తెలిసిందే. అలాగే ఫొటోలో హరీష్ శంకర్, మైత్రి నిర్మాత రవి శంకర్, కెమెరామెన్, శ్రీలీల, శ్రీలీల తల్లి.. పలువురు సినిమా సానకేతిక నిపుణులు ఉన్నారు. ఈ ఫొటోతో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లుక్ కూడా వైరల్ గా మారింది.
Also Read : Uppu Kappurambu : సుహాస్ – కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ వచ్చేసింది.. స్మశానంలో స్థలం కోసం గొడవ..