Viraatapalem : ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ రిలీజ్.. ఆ ఊళ్ళో పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి చనిపోతే..
తాజాగా ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

Viraatapalem Pc Meena Reporting Zee5 Web Series Trailer Released
Viraatapalem : సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీరామ్ నిర్మాణంలో కృష్ణ పోలూరు దర్శకత్వంలో అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ జూన్ 27 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
Also Read : Uppu Kappurambu : సుహాస్ – కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ వచ్చేసింది.. స్మశానంలో స్థలం కోసం గొడవ..
ట్రైలర్ చూస్తుంటే.. విరాటపాలెం అనే ఊళ్ళో పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి చనిపోతూ ఉంటుంది. అలంటి ఊళ్లోకి ఒక లేడి పోలీస్ కానిస్టేబుల్ రావడం, దీని గురించి తెలుసుకోవాలని రీసెర్చ్ చేయడం, అసలు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకోడానికి తను కూడా పెళ్లి చేసుకోవడం లాంటి కథాంశంతో సిరీస్ థ్రిల్లర్ గా సాగుతుందని తెలుస్తుంది.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నవీన్ చంద్ర గెస్ట్ గా హాజరయ్యారు. ఈవెంట్లో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. రెక్కీ నాకు చాలా ఇష్టమైన సిరీస్. ఆ డైరెక్టర్ మళ్లీ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’తో రాబోతోన్నారు. చాయ్ బిస్కెట్ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. ఆమె అద్భుతమైన నటి. ఈ సిరీస్‌లో నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు అని అన్నారు.
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ.. అను గారు నా మీద నమ్మకంతో నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. రెక్కీ తరువాత పదిహేను కథలు విన్నాను. కానీ ఏ సబ్జెక్ట్ కూడా నచ్చలేదు. దివ్య గారు చెప్పిన నెరేషన్ విన్న తరువాత ఈ కథ నన్ను చాలా వెంటాడింది. నా మాట కోసం కృష్ణ గారు వచ్చి డైరెక్షన్ చేశారు. సిరీస్ లో 80వ వాతావరణాన్ని చూపేందుకు ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర, క్యాస్టూడ్ డిజైనర్ అంజలి చాలా కష్టపడ్డారు అని తెలిపారు. హీరోయిన్ అభిజ్ఞ మాట్లాడుతూ.. ఇంత మంచి కథను రాసిన దివ్య గారికి థాంక్స్. మూఢ నమ్మకాల మీద పోరాడే ఈ కథ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. జూన్ 27న మా సిరీస్ జీ5 లో రాబోతోంది. అందరూ చూడండి అని తెలిపారు.
జీ5 కంటెంట్ హెడ్ సాయి తేజ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జీ5లో ‘రెక్కీ’ టాప్ పొజీషిన్‌లో ఉంది. ఆ రికార్డుని ‘విరాటపాలెం’ బ్రేక్ చేయబోతోంది. దీనికి ఫ్రాంచైజీలు కూడా తీసుకు రాబోతోన్నాం. కథను రాసిన దివ్య మా మాజీ ఉద్యోగి. సిరీస్‌ను స్టార్ట్ చేస్తే చివరి వరకు చూస్తూనే ఉంటారు. ట్విస్టులు, టర్న్‌లతో అందరినీ ఎంగేజ్ చేస్తుంటుంది. జీ5 లోగో మారింది కానీ కంటెంట్ మాత్రం అద్భుతంగానే ఉండబోతోంది అని అన్నారు.