Uppu Kappurambu : సుహాస్ – కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ వచ్చేసింది.. స్మశానంలో స్థలం కోసం గొడవ..

మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

Uppu Kappurambu : సుహాస్ – కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ వచ్చేసింది.. స్మశానంలో స్థలం కోసం గొడవ..

Suhas keerthy Suresh Uppu Kappurambu Movie Trailer Released

Updated On : June 19, 2025 / 2:28 PM IST

Uppu Kappurambu : సుహాస్ – కీర్తి సురేష్ మెయిన్ లీడ్స్ లో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మాణంలో వసంత్ మారింగంటి ఈ కథ రాయగా అని ఐ.వి. శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉప్పుకప్పురంబు. ఇది డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఉప్పుకప్పురంబు సినిమా అమెజాన్ ప్రైమ్ లో జులై 4 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.

తాజాగా ఉప్పుకప్పురంబు ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

Also Read : SSMB29 : వామ్మో అన్ని కోట్లతో మహేష్ – రాజమౌళి సినిమా సెట్.. ఇండియన్ సినీ చరిత్రలో ఖరీదైన సెట్.. ఏకంగా కాశీ మొత్తాన్ని..

ఉప్పు కప్పురంబు ట్రైలర్ ఆద్యంతం నవ్వించింది. ట్రైలర్ చూస్తుంటే.. ఓ ఊరిలో స్మశానంలో మనుషులను పూడ్చిపెట్టడానికి స్థలం అయిపోతుంది. కేవలం నలుగురికి మాత్రమే స్థలం మిగులుతుంది. మరి ఆ నాలుగు స్థలాలు ఊళ్ళో ఎవరు దక్కించుకుంటారు? ఈ సమస్యని కొత్తగా ఎన్నికైన ఊరి సర్పంచ్ ఏం చేస్తుంది అని కామెడీగా తెరకేకించినట్టు తెలుస్తుంది.