SSMB29 : వామ్మో అన్ని కోట్లతో మహేష్ – రాజమౌళి సినిమా సెట్.. ఇండియన్ సినీ చరిత్రలో ఖరీదైన సెట్.. ఏకంగా కాశీ మొత్తాన్ని..
ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నారు.

Mahesh Babu Rajamouli SSMB29 Movie Establish Kasi Set with Huge Budget
SSMB29 : మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా భారీగా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే నెలలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ కోసం ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశానికి వెళ్తారని సమాచారం.
అయితే ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నారు. ఇటీవల ఒడిశాలో ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఫోటోలు, వీడియోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. దాంతో అవుట్ డోర్ లో షూటింగ్స్ చేస్తే ఈ లీకుల బెడద తప్పదని కాశీలో చేయాలనుకున్న షూట్ మొత్తాన్ని సెట్ వేసి చేద్దామని ఫిక్స్ అయ్యారు రాజమౌళి.
Also Read : Prabhas – Kannappa : ‘కన్నప్ప’ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడో తెలుసా? ప్రభాస్ వస్తున్నాడా?
ఇందుకోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీగా కాశీ నగరం సెట్ వేస్తున్నారు. శివుడి ఆలయం, పలు ఆలయాలు, కాశీ రోడ్లు, గంగా నది, గంగా హారతి వేదిక.. ఇలా కాశీ నగరం మొత్తాన్ని సెట్ వేస్తున్నారు. ఈ సెట్ కి దాదాపు 50 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఆర్ట్ డైరెక్టర్ మోహన్ బింగి ఆధ్వర్యంలో ఈ సెట్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణ దశలో ఉంది. ఒక సాంగ్, కొన్ని సీన్స్, యాక్షన్ సీన్స్ ని ఈ సెట్ లో షూట్ చేస్తారట.
మహేష్ – రాజమౌళి యూనిట్ కెన్యాలో షూటింగ్ చేసుకొని వచ్చేలోపు ఈ సెట్ ని రెడీ చేస్తారని, కెన్యా షూటింగ్ అయ్యాక వారణాసి సెట్ లో షూట్ చేస్తారని సమాచారం. అయితే ఒక సెట్ కి 50 కోట్లు ఖర్చుపెట్టడం అనేది ఇండియాలోనే ఇప్పటివరకు హైయెస్ట్ అని తెలుస్తుంది. గతంలో బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ సినిమా కోసం దాదాపు 15 కోట్లు ఖర్చుపెట్టి సెట్ వేశారు. ఇప్పటివరకు ఇండియాలో సెట్ కోసం అత్యధికంగా ఖర్చు చేసింది ఆ సినిమా కోసమే. ఇప్పుడు 50 కోట్లతో మహేష్ – రాజమౌళి సినిమా సెట్ కోసం అత్యధికంగా ఖర్చుపెట్టిన సినిమాగా నిలిచింది. బడ్జెట్ లోనే రికార్డులు సృష్టిస్తుందంటే సినిమా రిలీజయ్యాక ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.
Also Read : Anchor Lasya : ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకు కార్ కొనిచ్చిన యాంకర్ లాస్య.. ఫొటోలు చూశారా?