Sreeleela : అయ్య బాబోయ్.. ఆ స్కూల్స్ కోసం యాడ్ చేసిన శ్రీలీల.. నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు..

శ్రీలీల ఇప్పటికే పలు యాడ్స్ చేసింది. తాజాగా శ్రీలీల మరో కొత్త యాడ్ చేసింది.

Sreeleela : శ్రీలీల ఇటీవల వరుస సినిమాలు చేసి ఒక్కసారిగా ఖాళీ అయింది ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. గత సంవత్సరం నెలకొక సినిమా రిలీజ్ చేసిన శ్రీలీల దగ్గర్నుంచి ఇప్పట్లో సినిమాలేమి వచ్చేలా లేవు. కానీ సోషల్ మీడియాలో, బయట ఈవెంట్స్ లో శ్రీలీల రెగ్యులర్ గా బిజీగానే ఉంది. సెలబ్రిటీలంతా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని యాడ్స్ కూడా బాగా చేస్తారు. ఇదే కోవలో శ్రీలీల కూడా ఇప్పటికే పలు యాడ్స్ చేసింది. తాజాగా శ్రీలీల మరో కొత్త యాడ్ చేసింది.

Also Read : ‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ.. సాఫ్ట్‌వేర్ అబ్బాయి కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమిస్తే..

శ్రీలీల ఓ సంస్థ స్కూల్స్ కోసం యాడ్ చేసింది. ఆ స్కూల్స్ లో పిల్లల్ని జాయిన్ చేపించండి అంటూ ప్రమోషనల్ యాడ్ చేసింది. ఆ యాడ్ ని శ్రీలీల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ యాడ్ వైరల్ గా మారింది. అయితే ఆ స్కూల్స్ పై కొంత నెగిటివిటి ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ చదివి బయటకి వచ్చిన వాళ్ళే పలువురు విమర్శిస్తారు. శ్రీలీల ఆ యాడ్ చేయడంతో కామెంట్స్ లో పలువురు నెటిజన్లు, అక్కడ చదివిన వాళ్ళు ఆ స్కూల్స్ తో పాటు శ్రీలీలను కూడా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు