Sreeleela – Samantha : అలాంటి హీరోలతో చేసేందుకు.. అప్పుడు సమంత.. ఇప్పుడు శ్రీలీల.. భారీగా..

శ్రీలీల జులై 18న జూనియర్ సినిమాతో రాబోతుంది.

Sreeleela Samantha

Sreeleela – Samantha : శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. తమిళ్, హిందీలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక శ్రీలీల రెమ్యునరేషన్ కూడా కోటి దాటేసింది టాలీవుడ్ లో. బాలీవుడ్ లో అయితే రెండు కోట్లు దాటేసిందని సమాచారం. శ్రీలీల జులై 18న జూనియర్ సినిమాతో రాబోతుంది.

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా జూనియర్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేయగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. కన్నడ – తెలుగులో సినిమా రిలీజ్ కాబోతుంది. కిరీటిని హీరోగా నిలబెట్టేందుకు బాగానే డబ్బు ఖర్చు చేస్తున్నారు.

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’లో సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్ ఇవే.. ఆ సీన్స్ తీసేయమని.. సినిమా టోటల్ రన్ టైం ఎంతంటే?

అయితే ఈ సినిమాకు శ్రీలీల ఏకంగా రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా ఒప్పుకున్నా సమయానికి శ్రీలీల స్టార్ హీరోయిన్ కాకపోయినా అప్పుడప్పుడే కేజ్ తెచ్చుకుంటుందని కొత్త హీరో పక్కన ఇంత భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి తీసుకున్నారట. శ్రీలీల కూడా భారీ రెమ్యునరేషన్ అని కిరీటి పక్కన ఒప్పుకున్నట్టు టాక్.

గతంలో సమంత కూడా స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న అల్లుడు శ్రీను సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుంది. ఈ సినిమాకు అప్పట్లోనే సమంతకు కోటి రూపాయలు పైనే ఇచ్చారని టాలీవుడ్ టాక్. అలా నిర్మాతల కొడుకులకు, డబ్బున్న వాళ్ళ తనయులకు గ్రాండ్ లాంచ్ కోసం హీరోయిన్స్ కి భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి తమ సినిమాలకు కాస్త క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అప్పట్లో సమంత చేసిన పనే ఇప్పుడు శ్రీలీల కూడా చేసి భారీ రెమ్యునరేషన్ తీసుకుందని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Also Read : Tanya Ravichandran : ప్రియుడికి లిప్ కిస్ ఇస్తూ.. పెళ్లి గురించి చెప్పేసిన హీరోయిన్‌..