Sreeleela : ఫుల్ ఫామ్‌‌లో ఉన్న శ్రీలీల.. సడెన్‌గా సినిమాలకు బ్రేక్.. ఎందుకంటే?

శ్రీలీల బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్స్ చేస్తోంది. అయితే ఒకవైపు షూటింగ్స్ చేస్తూనే మరో వైపు ఎంబీబీఎస్(MBBS) చదువుతోంది.

Sreeleela Shocking Decision Break to Movies Here Details

Sreeleela : వచ్చిన అవకాశాన్ని వద్దనుకుండా వరస పెట్టి సినిమాలు చేస్తోంది శ్రీలీల. ఆఫర్ రావడమే ఆలస్యం.. పెద్ద హీరో, చిన్న హీరో అన్న తేడా లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్స్ చేస్తోంది ఈ క్యూట్ హీరోయిన్. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. ఈ సంవత్సరం ఏకంగా స్కంద, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, భగవంత్ కేసరి, ఆదికేశవ.. నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. త్వరలోనే సంక్రాంతికి గుంటూరు కారం సినిమాని కూడా లైన్ లో పెట్టింది.

శ్రీలీల బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్స్ చేస్తోంది. అయితే ఒకవైపు షూటింగ్స్ చేస్తూనే మరో వైపు ఎంబీబీఎస్(MBBS) చదువుతోంది. యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నా తన ఎడ్యుకేషన్ ని కూడా అలాగే మెయింటెన్ చేస్తోంది. ఒక వైపు షూటింగ్స్ చేస్తూనే షూట్ గ్యాప్ లోమెడిసిన్ బుక్స్ చదువుకునే శ్రీలీల ఇప్పుడు కొన్నాళ్లు షూట్స్ కి బ్రేక్ ఇచ్చింది అని సమాచారం. మెడిసిన్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని, వాటి కోసం కొన్ని రోజులు గట్టిగా ప్రిపేర్ అయి ఎగ్జామ్స్ రాయాలని అందుకే సినిమాలకు శ్రీలీల చిన్న బ్రేక్ ప్రకటించింది.

Also Read : Roshan Kanakala : సుమ ముందే హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన కొడుకు రోషన్.. చూడలేక చీరతో మొహం కప్పేసుకున్న సుమ..

ఈ సంవత్సరం అంతా శ్రీలీల సినిమా షూటింగ్స్, రిలీజ్ లు, ప్రమోషన్స్ తో తీరిక లేకుండా గడిపింది. చేతిలో షూట్ అవ్వాల్సిన సినిమాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అందుకే ఎగ్జామ్స్ తో పాటు చిన్న గ్యాప్ తీసుకొని ఫుల్ గా రీఛార్జ్ అయి వచ్చే సంవత్సరం మళ్ళీ ఫుల్ బిజీ అవ్వడానికి రెడీ అయిపోతుంది శ్రీలీల. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేసి అభిమానులని, నెటిజన్లను అలరిస్తుంది.