Sreeleela: అప్పుడు శ్రుతి హాసన్.. ఇప్పుడు శ్రీలీల.. పవన్ ఛాన్స్‌తో అలా..!

‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ సెన్సేషన్ శ్రీలీల, ఆ తరువాత ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రీలీల టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అమ్మడికి వరుసగా సినిమా ఛాన్స్‌లు వస్తుండటంతో, శ్రీలీల యంగ్ సెన్సేషన్‌గా తనకంటూ ప్రత్యేకి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

Sreeleela To Get Power With Pawan Kalyan Movie

Sreeleela: ‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ సెన్సేషన్ శ్రీలీల, ఆ తరువాత ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రీలీల టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అమ్మడికి వరుసగా సినిమా ఛాన్స్‌లు వస్తుండటంతో, శ్రీలీల యంగ్ సెన్సేషన్‌గా తనకంటూ ప్రత్యేకి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

Sreeleela : అనాథాశ్రమంలో పిల్లలతో సందడి చేసిన శ్రీలీల

ఈ క్రమంలోనే శ్రీలీల యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాలో శ్రీలీల పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK108 మూవీలో శ్రీలీల నటిస్తుండటంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఈ క్రేజ్ శ్రీలీలకు ఓ పవర్‌ఫుల్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ను తెచ్చిపెట్టిందట. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీలో ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఈ అమ్మడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో అందాల భామ శ్రుతి హాసన్, పవన్-హరీష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ సినిమాతో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పుడు అదే సీన్, శ్రీలీలకు కూడా రిపీట్ కానుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Sreeleela : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో శ్రీలీల.. ఛాలెంజ్ ఎవరికీ విసిరిందో తెలుసా??

దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి శ్రీలీల తాజాగా సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి 30న స్టార్ట్ కానుందని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని 2024 వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.