Sreeleela To Romance Naveen Polishetty In Anaganaga Oka Raju
Sreeleela: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పెళ్లిసందడి’ ఆ రోజుల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమాతో హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇక అదే టైటిల్‌తో ఇటీవల శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయినా, కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.
Sreeleela: బాగా పెంచేసిన కన్నడ బ్యూటీ.. సినిమాకి కోటి డిమాండ్?
అందంతో పాటు అభినయం, డ్యాన్సులు బాగా వేస్తున్న ఈ బ్యూటీ, తొలి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘ధమాకా’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది ఈ చిన్నది. అంతేగాక, త్వరలో పట్టాలెక్కనున్న నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించనుంది. అయితే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఈ బ్యూటీ పట్టేసింది.
Sreeleela: క్రేజీ ఆఫర్లు.. కన్నడ బ్యూటీకి మరో జాక్‌పాట్!
జాతిరత్నాలు సినిమాతో యూత్ స్టార్‌గా మారిపోయిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలా ఎంపికయ్యింది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్, ఆమెకు విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాలో శ్రీలీలా పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.
Team #AnaganagaOkaRaju wishes the gorgeous & talented @sreeleela14 a very happy birthday!#HBDSreeLeela ✨ pic.twitter.com/zOP4LDUKN6
— Sithara Entertainments (@SitharaEnts) June 14, 2022