Sreeleela : అనాథాశ్రమంలో శ్రీలీల సందడి.. ఎమోషనల్ పోస్ట్..

తాజాగా శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథాశ్రమానికి వెళ్ళింది. అక్కడి పిల్లలతో రోజంతా సరదాగా గడిపింది. అక్కడి పిల్లలతో ఆనందంగా గడిపిన కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.................

Sreeleela : అనాథాశ్రమంలో శ్రీలీల సందడి.. ఎమోషనల్ పోస్ట్..

Sreeleela visited an Orphanage and share some photos and emotional post

Updated On : March 6, 2023 / 3:43 PM IST

Sreeleela :  తెలుగులో పెళ్ళిసందD, ధమాకా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది కన్నడ భామ శ్రీలీల. ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు తెలుగు, కన్నడ కలిపి 10 సినిమాలు ఉన్నాయి. సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథాశ్రమానికి వెళ్ళింది. అక్కడి పిల్లలతో రోజంతా సరదాగా గడిపింది. అక్కడి పిల్లలతో ఆనందంగా గడిపిన కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.

అనాధాశ్రమంలోని పిల్లలతో గడిపిన ఫోటోలని శ్రీలీల షేర్ చేస్తూ.. నా చిన్న సమూహం. వీళ్లంతా పెద్ద కలలతో, పెద్ద హృదయంతో ఉన్నారు. వీళ్ళు చాలా విలువైనవాళ్లు అని వీరితో గడిపెవరకు తెలీదు. ఇవాళా నా రోజంతా సరదాగా వీరితో గడిచింది. కలలు, కథలు, డ్యాన్స్, పాటలు, పాంపరింగ్, ప్రేమతో ఒకరినొకరు పలకరించడం.. ఇవన్నీ నా రోజుని అందంగా మార్చేశాయి. వారి చిన్ని మాటలు, చిరు ప్రేమలతో నన్ను ముంచెత్తారు. మనలో అందరూ ఇలాంటి ఒకరోజుని అనుభవించాలి. అది మనం తలుచుకుంటే సాధ్యమే. అదంతా మన చేతుల్లోనే ఉంది. నెట్ లో వెతికితే మన చుట్టూ ఉండే ఇలాంటి అనాథాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్ళండి, వారితో గడపండి. నేను విరాళాలు ఇమ్మనట్లేదు, కానీ వారికి కొంచెం టైం, ప్రేమ ఇవ్వండి. వాళ్లకు ఒక రోజైనా భోజనం పెట్టి వాళ్ళతో పాటు తినండి. వాళ్ళ కోసం ప్రార్థిద్దాం. ఇలాంటివి మీరంతా చేస్తారని ఆశిస్తున్నాను. మీరు కూడా ఇలా ఏదైనా అనాధాశ్రమాన్ని లేదా సంస్థని సందర్శించి ఒక ఫోటో పోస్ట్ చేసి #Hereforyou అని ట్యాగ్ చేయండి. ఏమంటారు.. అని పోస్ట్ చేసింది.

Shobu Yarlagadda : బాహుబలి నిర్మాతలకి థ్యాంక్స్ చెప్పిన పఠాన్ చిత్రయూనిట్..

దీంతో శ్రీలీల అభిమానులు, నెటిజన్లు హీరోయిన్ గానే కాకుండా ఇలా కూడా ప్రేక్షకుల మనసులని దోచుకుంటుందని పొగుడుతూ, శ్రీలీల చేస్తున్న మంచిపనిని అభినందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)