టాప్ సెలబ్రిటీతో రిలేషన్‌లో ఉన్నా.. చచ్చిపోవాలి అనిపించింది: శ్రీముఖి

  • Publish Date - October 25, 2019 / 03:43 AM IST

బిగ్ బాస్3.. కాస్త సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, గొడవలు, కోపాలు, చాడీలు అంటూ ఓ రేంజ్‌లో సాగింది. చివరకు బిగ్ బాస్ హౌస్ ఈ వారం మాత్రం కాస్త సీరియస్‌గా, ఇంకాస్త ఎమోషనల్‌గా చాలా టఫ్‌గా నడుస్తుంది. 95రోజులు పూర్తి చేసుకుని చివరి ఎలిమినేషన్‍‌‌కు చేరకుంది బిగ్ బాస్.

ఈ క్రమంలోనే టఫ్ టాస్క్‌లు ఇస్తున్న బిగ్ బాస్ లేటెస్ట్‌గా ఇంటి సభ్యుల జీవితాలను కుదిపేసిన ఘటనలను వారితో చెప్పించారు. దీంతో ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ, అల్లరిగా ఉండే శ్రీముఖి తన జీవితంలో జరిగిన విషాదం గురించి వెల్లడించింది.

ఇప్పటివరకు ఎక్కడా తన వ్యక్తిగత విషయాలను బయట చెప్పుకోడానికి ఇష్టపడలేదని చెప్పిన శ్రీముఖి, తాను కూడా ప్రేమలో పడ్డానని.. కానీ అది ఎన్నో మలుపులు తిరిగి చివరకు బ్రేకప్‌ అయిందని చెప్పింది. అది కూడా ఘోరంగా బ్రేకప్‌ అయిందని, ఆ సమయంలో చచ్చిపోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది.

ఏ అమ్మాయికైనా అఫైర్లు సాధారణం. తాను యాంకర్‌గా పీక్స్‌లో ఉన్నప్పుడు ఒక ప్రముఖుడితో అఫైర్ ఉండేది. ఓ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో షూటింగ్ చేస్తుండగా నాకు బ్రేకప్ మెసేజ్ వచ్చింది. అప్పుడు తట్టుకోలేక మేకప్ రూమ్‌లోకి వెళ్లిపోయాను. నాకు మేకప్ చేస్తుండగానే భోరున ఏడ్చాను. స్టేజ్ మీద కూడా ఏడుస్తూనే ఆ రోజు షూట్ కంప్లీట్ చేశాను.

ఆ బ్రేకప్ నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించింది. ఆ బాధను తట్టుకోలేక చచ్చిపోవాలని అనుకొన్నాను. కానీ నాకు నేనుగా ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుని ఓ స్టేజ్‌కు చేరుకొన్న తర్వాత రిలేషన్స్ పెట్టుకోవాలని అనుకున్నాను. ఆ తర్వాత నేను ఎటువంటి రిలేషన్ జోలికి వెళ్లలేదు. నాకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుని మారిపోయాను అని చెప్పుకొచ్చింది.

అయితే శ్రీముఖి తనకు బ్రేకప్ చెప్పిన వ్యక్తి ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఆ వ్యక్తి పేరు చెబితే మరో కొత్త స్టోరీ స్టార్ట్ అవుతుంది అంటూ శ్రీముఖి తన డార్క్ సీక్రెట్‌ను రివీల్ చేసింది.