Sreenu Vaitla : వెంకీ సినిమాలాగే రాబోయే ఆ సినిమాలో కూడా ట్రైన్ సీన్.. సూపర్ న్యూస్ చెప్పిన శ్రీనువైట్ల..

దర్శకుడు శ్రీను వైట్ల కూడా థియేటర్ లో వెంకీ రీ రిలీజ్ చూసి, దానికి వచ్చిన స్పందన చూసి సంతోషించాడు. వెంకీ రీ రిలీజ్ కి థ్యాంక్స్ చెప్తూ ఓ స్పెషల్ ట్వీట్ చేశాడు శ్రీను వైట్ల.

Sreenu Vaitla : వెంకీ సినిమాలాగే రాబోయే ఆ సినిమాలో కూడా ట్రైన్ సీన్.. సూపర్ న్యూస్ చెప్పిన శ్రీనువైట్ల..

Sreenu Vaitla Announce Interesting News about Gopichand Movie

Updated On : January 1, 2024 / 9:43 AM IST

Sreenu Vaitla : ఒకప్పుడు తన కామెడీతో కమర్షియల్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టిన శ్రీను వైట్ల ప్రస్తుతం హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ(Raviteja) హీరోగా తెరకెక్కిన వెంకీ(Venky) సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఫుల్ కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి ప్రేక్షకులని కూడా మెప్పిస్తుంది. ఇటీవలే వెంకీ సినిమా రీ రిలీజ్ చేయగా అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ లో సందడి చేశారు.

రీ రిలీజ్ థియేటర్స్ లో ప్రేక్షకులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. బ్రహ్మానందం సీన్స్ కి అరుపులు, విజిల్స్, పేపర్లు ఎగరేసి సందడి చేశారు. డైలాగ్స్, సాంగ్స్ సీన్స్ వస్తుంటే బట్టీపట్టినట్టు అప్పచెప్పేశారు. ట్రైన్ సీన్స్ కి అయితే రచ్చ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల కూడా థియేటర్ లో వెంకీ రీ రిలీజ్ చూసి, దానికి వచ్చిన స్పందన చూసి సంతోషించాడు. వెంకీ రీ రిలీజ్ కి థ్యాంక్స్ చెప్తూ ఓ స్పెషల్ ట్వీట్ చేశాడు శ్రీను వైట్ల.

శ్రీను వైట్ల తన ట్వీట్ లో.. నేను ముందుగానే చెప్పినట్టు వెంకీ నాకు మనసుకు దగ్గరైన సినిమా. ఆ సినిమా ప్రేక్షకులకు కూడా అంతగా నచ్చినందుకు ఆనందిస్తున్న. రీ రిలీజ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి సంతోషంతో మాటలు లేవు. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆడియన్స్ అందరికి థ్యాంక్యూ వెరీమచ్. మీమర్స్ కి నా స్పెషల్ థ్యాంక్స్. మీ మీమ్స్ రూపంలో వెంకీ ఫ్రేమ్స్ ని ఇంకా ఫ్రెష్ గా ఉంచుతున్నందుకు. ఇది నాకు మరింత బాధ్యతను ఇచ్చింది. నేను ఒక విషయాన్ని చెప్పకుండా దాచలేకపోతున్నా. ఇలాంటి సెలబ్రేషన్ ఉండే ట్రైన్ జర్నీ నా నెక్స్ట్ గోపీచంద్ సినిమాలో కూడా ఉండబోతుంది అని తెలిపారు.

Also Read : Hi Nanna : మొత్తానికి ‘హాయ్ నాన్న’ కలెక్షన్స్ బయటపెట్టారుగా.. నాని మరో భారీ హిట్..

దీంతో గోపీచంద్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఆ సినిమాలో ట్రైన్ కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడటానికి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ – శ్రీను వైట్ల సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.