800 Movie : ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ మూవీ రివ్యూ.. తప్పకుండా చూడాల్సిన బయోపిక్..

ఇప్పటివరకు వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్స్ లో ఇది ఒక బెస్ట్ బయోపిక్ అని చెప్పొచ్చు. ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రని కళ్ళకి కట్టినట్టు చాలా ఎమోషనల్ గా చూపించారు.

800 Movie Review : శ్రీలంక(Srilanka) క్రికెట్(Cricket) ఆటగాడు, లెజెండ‌రీ బౌలర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్(Muttiah Muralitharan) జీవితం ఆధారంగా ‘800’ అనే సినిమా రాబోతుంది. ఎంఎస్ శ్రీపతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ముర‌ళీధ‌ర‌న్ పాత్రని స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ ‘మధుర్ మిట్టల్’(Madhur Mittal) చేశాడు. మహిమా నంబియార్(Mahima Nambiar) ముఖ్య పాత్రలో నటించింది. ఈ బయోపిక్ నేడు అక్టోబర్ 6న రిలీజయింది.

కథ విషయానికొస్తే శ్రీలంక లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ చిన్నప్పట్నుంచి ఎలా పెరిగాడు, అతని చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎలా క్రికెట్ లోకి వచ్చాడు, ఎలా స్టార్ అయ్యాడు, క్రికెట్ లో, జీవితంలో అతను ఎదుర్కున్న అవమానాలు.. మొత్తంగా చెప్పాలంటే ముత్తయ్య మురళీధరన్ జీవితాన్ని చాలా దగ్గరగా చూపించారు.

ఇప్పటివరకు వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్స్ లో ఇది ఒక బెస్ట్ బయోపిక్ అని చెప్పొచ్చు. ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రని కళ్ళకి కట్టినట్టు చాలా ఎమోషనల్ గా చూపించారు. సినిమా చూసిన తర్వాత ముత్తయ్య జీవితంలో, క్రికెట్ లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా, ఇన్ని అవమానాలు ఉన్నాయా అని కచ్చితంగా ఎమోషనల్ అవుతాం. ముత్తయ్య పూర్వికులు తమిళనాడు నుంచి శ్రీలంకకు వలసదారులుగా వెళ్లి అక్కడ సెటిల్ అవ్వడంతో చిన్నప్పట్నుంచి శ్రీలంక-తమిళ్ గొడవల్లో ఉండటం, అతని చేయి పుట్టుకతోనే వంకరగా ఉండటంతో ICC లో అతను మోసం చేస్తూ ఆడుతున్నాడని అనడం, అది అబద్దం అని ప్రూవ్ చేసుకోవడం.. ఇలా జీవితమంతా అతను ప్రతిసారి తన నిజాయితీ, ఐడెంటిటీ గురించి పోరాడుతూనే క్రికెట్ లో రికార్డులు సాధించడం చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చూపించారు.

Also Read : Month Of Madhu : ‘మంత్ అఫ్ మధు’ మూవీ రివ్యూ.. రెండు కథలు.. బోలెడన్ని ఎమోషన్స్.. కానీ..

సినిమాలో ముత్తయ్య మురళీధరన్ మెయిన్ లీడ్ చేసిన మధుర్ మిట్టల్ నిజంగా జీవించాడు అని చెప్పొచ్చు. సినిమాలో నటించిన అందరూ చాలా బాగా నటించారు. దర్శకుడు శ్రీపతి.. శ్రీలంక-తమిళనాడు సమస్య, శ్రీలంక క్రికెటర్స్ పై పాకిస్థాన్ ఉగ్రదాడి.. ఇలా అన్ని అంశాలని చాలా పర్ఫెక్ట్ గా చూపించి మెప్పించాడు. ఇక గిబ్రన్ ఇచ్చిన సంగీతం అయితే సినిమాకు చాలా ప్లస్ అయింది. ప్రేక్షకులని కచ్చితంగా ఈ సినిమా కంటతడి పెట్టించి మెప్పిస్తుంది. ముఖ్యంగా క్రికెట్ లవర్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే..

ట్రెండింగ్ వార్తలు