Haiku : ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి తమిళ్ సినిమా.. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్..
హైకూ సినిమా అక్టోబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. (Haiku)
Haiku
Haiku : తమిళ నటుడు ఏగన్, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తమిళ సినిమా హైకూ. విజన్ సినిమా హౌస్ బ్యానర్పై డా. డి.అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మాణంలో యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తి నెలకొంది. హైకూ సినిమా అక్టోబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి కోన వెంకట్, డైరెక్టర్ రామ్ జగదీశ్ గెస్టులుగా హాజరయ్యారు.
ఈ ప్రెస్ మీట్ లో హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే బాగా నచ్చి వెంటనే ఓకే చేశా. లవ్ లో ఉన్నా, రిలేషన్ షిప్ లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అయినా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. లవ్ లో ఉన్న కాంప్లికేషన్స్ ఈ సినిమాలో చూస్తారు. ఏగన్ డౌన్ టు ఎర్త్. ఆయనతో కలిసి పని చేయడం హ్యాపీగా అనిపించింది. తమిళ్ లో ఇది నా ఫస్ట్ డెబ్యూ అని తెలిపింది. హీరో ఏగన్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి కొత్త. హైకూ సినిమా క్లోజ్ టు మై హార్ట్. ఈ సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. 200 పర్సెంట్ హైదరాబాద్ లో మళ్ళీ హైకూ సక్సెస్ మీట్ లో కలుస్తాను అని తెలిపాడు.
Also Read : Jabardasth Emmanuel : జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్.. టైటిల్ ఏంటో తెలుసా?
కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. హైకూ కి నా పర్సనల్ స్పెషల్ ఇంట్రెస్ట్ శ్రీదేవి. ఆమెకు ఇది తమిళ్ డెబ్యూ. ఆవిడ కళ్ళతో ఏ భాష అయినా మాట్లాడగలదు అని తెలిపాడు. కోన వెంకట్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూడగానే కూల్గా, ఆహ్లాదంగా అనిపించింది. ముందే ఓటీటీకి అమ్మేసి తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం నిజంగా గ్రేట్. నెట్ ఫ్లిక్స్ వారికి స్టోరీ చెప్పి ఈ హైకూ తీశారంటే వాళ్ళని ఈ స్క్రిప్ట్ ఎంత మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. మనల్ని మళ్ళీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది అని అన్నారు.
