Srikanth injured in NTR Devara Movie Shooting at Goa
Srikanth : RRR సినిమా తర్వాత ఎన్టీఆర్(NTR) ‘దేవర’(Devara) సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో రెండు పార్టులుగా దేవర సినిమా భారీగా తెరకెక్కుతుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ మూవీలో సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్స్ గా కనిపించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా ఉన్నాడని కంఫర్మ్ అయిపోయింది. ఈ సినిమాలో ఇంకా పలువురు స్టార్స్ నటిస్తున్నారని సమాచారం. శ్రీకాంత్ కూడా దేవరలో నటిస్తున్నట్టు గతంలో వార్తలు రాగా ఇప్పుడు స్వయంగా శ్రీకాంత్ కంఫర్మ్ చేశాడు. శ్రీకాంత్ కోటబొమ్మాళి PS సినిమాతో నవంబర్ 24న రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కి వెళ్ళాడు.
అయితే శ్రీకాంత్ కాలికి పట్టి వేసి ఉండటంతో నాగార్జున కాలికి ఏమైంది అని అడిగాడు. దీనికి శ్రీకాంత్ సమాధానమిస్తూ.. ఇది దేవర సినిమా షూటింగ్ లో జరిగింది. గోవాలో షూటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం దూరం ఇసుకలో నడిచి వెళ్ళాలి. ఇసుకలో కాలు బెణికింది. చిన్న దెబ్బే అనుకోని పట్టించుకోలేదు. కానీ తెల్లారేసరికి కాలు వాచిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ చేసి రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కానీ నేను షూటింగ్ కి వెళ్ళిపోయాను. నిలబడే డైలాగ్స్ చెప్పాను. దేవర షూటింగ్ పూర్తి చేసే వచ్చాను అని తెలిపాడు.
దీంతో సినిమా కోసం కాలికి గాయం అయినా రెస్ట్ తీసుకోకుండా కష్టపడ్డాడని శ్రీకాంత్ ని అభినందిస్తుంటే.. పలువురు ఎన్టీఆర్ అభిమానులు దేవర షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీకాంత్ దేవరలో విలన్ రోల్ లో చేస్తున్నాడా? లేదా ఇంకేదైనా కీలక పాత్ర చేస్తున్నాడా తెలియాలి.
Irrespective Of Injuries, Etc. @tarak9999, Team #Devara Continuous Shooting Happening To Give Their Best For Audience On April 5th, 2024 ???.@actorsrikanth ??. pic.twitter.com/XX3wFLZKov
— Sai Mohan 'NTR' (@sai_mohan_9999) November 19, 2023