Allu Arjun : పుష్ప 2 షూటింగ్ అప్డేట్.. ఆ గెటప్ మేకప్ కోసం రెండు గంటలు.. అల్లు అర్జున్ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్..

తాజాగా పుష్ప 2 సినిమా అప్డేట్ టాలీవుడ్ వినిపిస్తుంది. పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా..

Allu Arjun : పుష్ప 2 షూటింగ్ అప్డేట్.. ఆ గెటప్ మేకప్ కోసం రెండు గంటలు.. అల్లు అర్జున్ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్..

Pushpa 2 Movie Update Allu Arjun Hard Working for Pushpa 2 Gangamma Jathara Getup

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2(Pushpa 2) సినిమా గురించి అంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ఇచ్చిన హైప్ తో పార్ట్ 2పై దేశమంతా భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 వచ్చే సంవత్సరం ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇటీవలే ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను పుష్ప షూట్ నుంచే వచ్చాను. రామోజీ ఫిలింసిటీలో పుష్ప 2 షూట్ జరుగుతుంది. లాస్ట్ టైం రిలీజ్ చేసిన జాతర పోస్టర్ చూశారు కదా, ఆ జాతర షూట్ జరుగుతుంది అని చెప్పారు. తిరుపతి గంగమ్మ జాతర లో వేసే గెటప్ తో అల్లు అర్జున్ పోస్టర్ ఒకటి గతంలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ అప్పట్లో బాగా వైరల్ గా మారింది.

తాజాగా పుష్ప 2 సినిమా అప్డేట్ టాలీవుడ్ వినిపిస్తుంది. పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా.. తిరుపతి గంగమ్మ జాతర ఎపిసోడ్, ఆ జాతర గెటప్ లో అల్లు అర్జున్ తో ఒక ఫైట్ సీన్, ఒక సాంగ్ షూట్ జరుగుతున్నట్టు సమాచారం. ఇంకొన్ని రోజులు ఈ షూట్ కొనసాగనుందని తెలుస్తుంది. అలాగే ఆ గెటప్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. ఆ గెటప్ లో కనపడటానికి కనీసం రెండు గంటలు మేకప్ కోసం కష్టపడుతున్నారట. ఇక షూట్ అయ్యాక మేకప్ తీయడానికి కూడా చాలా సమయం పడుతుందట. ఇలా రోజూ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతో డెడికేషన్ తో మేకప్ వేయించుకొని కష్టపడుతున్నాడు..

Also Read : Leo Movie : విజయ్ ‘లియో’ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.. ఏ ఓటీటీలో? ఎప్పట్నించి?

దీంతో పలువురు అల్లు అర్జున్ ని మరోసారి అభినందిస్తున్నారు. ఇటీవల పుష్ప సినిమాతో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత డెడికేషన్ తో ఇంకా కష్టపడుతుండటం చూసి పుష్ప 2కి కూడా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.