Crazy Uncles: వివాదంలో శ్రీముఖి సినిమా.. మహిళా సంఘాల ఆగ్రహం!
ఒకప్పుడు సినిమాలు వేరు.. ఇప్పటి సినిమాలు వేరు. మేకింగ్ తేడాతో కంటెంట్ లో కూడా తేడాలొచ్చేశాయి. అప్పుడు సినిమాలో పాటలు ఎలా ఉన్నా..

Crazy Uncles
Crazy Uncles: ఒకప్పుడు సినిమాలు వేరు.. ఇప్పటి సినిమాలు వేరు. మేకింగ్ తేడాతో కంటెంట్ లో కూడా తేడాలొచ్చేశాయి. అప్పుడు సినిమాలో పాటలు ఎలా ఉన్నా.. ఎలాంటి కామెడీ పండించినా ప్రేక్షకులు దానిని వినోదంలాగే చూసేవారు. అప్పటి సినిమాలపై కానీ.. పాటల విషయంలో కాని.. సన్నివేశాల విషయంలో కాని ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు తెలిపేవారు. సినిమాను సినిమాలాగానే చూసేవారు.
కానీ ఈ మధ్య కాలంలో పరిశ్రమలోని సినిమాలు, పాటలపై వివాదాలు తలెత్తుతున్నాయి. వివాదం లేకుండా వెండితెర మీద ఆడేసి వెళ్లిన సినిమా అంటే ఇప్పుడు మహా గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలను వివాదాలు చుట్టుముట్టేయగా ఇప్పుడు శ్రీముఖి క్రేజీ అంకుల్స్ వంతు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కామెడీగా మంచి మార్కులే కొట్టేయగా సినిమా ఈనెల 19న విడుదల కానుంది.
అయితే, ట్రైలర్ లో మహిళల్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని మహిళా సంఘాలు ఆరోపణ చేశాయి. సినిమా విడుదల ఆపేయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సినిమా విడుదల ఆపకపోతే తెలంగాణా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. శ్రీముఖి, సీనియర్ సింగర్ మనో, నటుడు రాజారవీంద్ర, భరణి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల ఇప్పుడు సస్పెన్స్ లో పడింది.