శ్రీను సినిమాకు జక్కన్న విషెస్
దర్శకుధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ సినిమా ద్వారా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివాస రెడ్డికి శుభాకాంక్షలు తెలియచేశారు..

దర్శకుధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ సినిమా ద్వారా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివాస రెడ్డికి శుభాకాంక్షలు తెలియచేశారు..
పాపులర్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి దర్శక, నిర్మాత ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’.. (మంచి రసగుల్లా లాంటి సినిమా) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆకృతి – ఆశృతి సమర్పణలో.. ఏ ఫ్లైయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై.. శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ థియేట్రికల్ ట్రైలర్ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తోంది.
శుక్రవారం దర్శకుధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమా ద్వారా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివాస రెడ్డికి శుభాకాంక్షలు తెలియచేశారు.. ‘‘నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి శ్రీనివాసరెడ్డి నాకు తెలుసు. తను మంచి కమెడియన్. తొలిసారి ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమాతో దర్శక, నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలుపుతున్నాను’’ అంటూ రాజమౌళి ట్వీట్ చేస్తూ ట్రైలర్ షేర్ చేశారు.
Read Also : రిలీజ్ డేట్స్ మారాయిగా!
శ్రీనివాస రెడ్డితో పాటు సత్య, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించగా, వెన్నెల కిశోర్, చిత్రం శ్రీను, రఘబాబు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క జరుగుతోంది.. డిసెంబర్ 6న ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ రిలీజ్ కానుంది. సినిమాటోగ్రఫీ : భరణి కె ధరన్, ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, మ్యూజిక్ : సాకేత్ కోమండూరి, ఆర్ట్ : రఘు కులకర్ణి, లైన్ ప్రొడ్యూసర్ : చిత్రం శ్రీను, నిర్మాత, దర్శకత్వం : వై.శ్రీనివాస రెడ్డి.
Here’s the trailer of #BhagyanagaraVeedulloGammathu…https://t.co/MVLrwHgTAz
Srinivas Reddy is one of the finest comedians I know since the beginning of my career… Wishing him the best on his debut as a director and producer… @ActorYSR #BVGonDec6th
— rajamouli ss (@ssrajamouli) November 22, 2019