SSMB 28 : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..

దుబాయ్‌లో మహేష్ బాబుని కలిసిన త్రివిక్రమ్ - థమన్..

SSMB 28 : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..

Ssmb

Updated On : December 27, 2021 / 4:01 PM IST

SSMB 28: సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ఫస్ట్ మూవీ ‘అతడు’ సూపర్ డూపర్ హిట్ అవడమే కాక, టీవీలోనూ TRP రేటింగ్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Pushpa : ప్రతీ సీన్ చక్కగా చెక్కావయ్యా సుకుమార్.. చిరు అభినందనలు..

‘ఖలేజా’ కాస్త నిరాశపరిచినా సూపర్ స్టార్‌లోని సరికొత్త కామెడీ కోణాన్ని ప్రేక్షకాభిమానులకు పరిచయం చేశారు త్రివిక్రమ్.. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతోంది.. మహేష్ నటించబోయే 28వ సినిమా ఇది.. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది.

Ssmb 28

 

మహేష్ బాబుని రీసెంట్‌గా దుబాయ్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ కలిశారు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు చర్చించుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో SSMB 28 స్టార్ట్ కానుంది.

Mahaan : విక్రమ్ – ధృవ్ విక్రమ్‌ల సినిమా వచ్చేస్తోంది..