SSMB 29
SSMB 29 : రాజమౌళి – మహేష్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే SSMB29 నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. నవంబర్ 15న ఈ సినిమా టైటిల్ ప్రకటించడానికి భారీ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.(SSMB 29)
త్వరలోనే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన వారణాసి సెట్ లో జరగనుంది. రాజమౌళి – మహేష్ బాబు సినిమా మొదటి ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కంటే ముందే ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ వైరల్ గా మారాయి.
గ్లోబ్ ట్రాటర్ అని ఈ సినిమాని రాజమౌళి ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాన్నే టైటిల్ గా ఫిక్స్ చేస్తారట. ఇది ఈ సినిమా వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారట. గతంలో బాహుబలి అనేది వర్కింగ్ టైటిల్ పెట్టుకొని తర్వాత దాన్నే టైటిల్ గా ప్రకటించారు. RRR సినిమాకు కూడా మొదట అది వర్కింగ్ టైటిల్ గా ప్రకటించి బాగా వైరల్ అవ్వడంతో టైటిల్ గా మార్చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ ఆల్రెడీ గ్లోబ్ ట్రాటర్ అనేది వరల్డ్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు కాబట్టి అదే టైటిల్ గా పెడతారట. అంతే కాకుండా హాలీవుడ్ రిలీజ్ కి కూడా రాజమౌళి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే హాలీవుడ్ వాళ్లకు కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుందని ఆ టైటిల్ నే ఫిక్స్ చేస్తారట. నవంబర్ 15న ఆ టైటిల్ నే అధికారికంగా ప్రకటిస్తారట.
అలాగే ఈ సినిమాని 2027 ఏప్రిల్ లో ఉగాది పండగకు రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ అయిపోయింది. వచ్చే సంవత్సరం మొదట్లోనే షూటింగ్ మొత్తం పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కి ఒక సంవత్సరం టైం తీసుకొని 2027లో రిలీజ్ చేస్తారని టాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే 2027 ఏప్రిల్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగే.