×
Ad

SSMB29 : నువ్వు నాశనం చేశావు.. మహేష్ పై రాజమౌళి ఫైర్.. ట్విట్టర్లో మహేష్, రాజమౌళి, ప్రియాంక, పృథ్వీరాజ్ వార్..

రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన మొదటి అప్డేట్ నవంబర్ లో ఇస్తానని ప్రకటించారు.(SSMB29)

SSMB29

SSMB29 : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకుంది. రాజమౌళి బాహుబలి రీ రిలీజ్ పనుల్లో ఉండటంతో ఈ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ వచ్చింది. అలాగే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన మొదటి అప్డేట్ నవంబర్ లో ఇస్తానని ప్రకటించారు.(SSMB29)

నవంబర్ రావడంతో నిన్న నవంబర్ 1న రాత్రి మహేష్ బాబు.. ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది అంటూ రాజమౌళికి అప్డేట్ గురించి గుర్తు చేస్తూ ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ కి రాజమౌళి, ప్రియాంక, పృథ్వీరాజ్ రిప్లైలు ఇస్తూ సోషల్ మీడియాలో సరదాగా ట్వీట్ వార్స్ చేసుకున్నారు. దీంతో వీళ్ళ ట్వీట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Champion : హమ్మయ్య శ్రీకాంత్ కొడుకు హీరోగా రెండో సినిమా వస్తుంది.. ‘ఛాంపియన్’ టీజర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే?

SSMB29

మహేష్ ట్వీట్ కి రాజమౌళి సమాధానమిస్తూ.. అవును.. నవంబర్ వచ్చింది. ఈ నెలలో ఏ సినిమాలకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు అంటూ మహేష్ బాబుకి కౌంటర్ ఇచ్చారు. దానికి మహేష్ స్పదిస్తూ.. మీరు ఎప్పటి నుంచో తయారు చేస్తున్న మహాభారతం సినిమాకి ఇస్తాను అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అలాగే.. ముందుగా నవంబర్‌లో మీరు మాకు ఏదో హామీ ఇచ్చారు. మీ మాట నిలబెట్టుకోండి అన్నాడు మహేష్. దానికి రాజమౌళి.. మహేష్ ఇప్పుడే కదా మొదలైంది. నెమ్మదిగా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాను అన్నారు.

దీనికి మహేష్ స్పందిస్తూ.. ఎంత నెమ్మదిగా ఇస్తారు సార్? 2030లో స్టార్ట్ చేద్దామా అని కౌంటర్ వేసాడు. అంతే కాకుండా ప్రియాంక చోప్రా జనవరి నుంచి హైదరాబాద్‌లోని ప్రతి వీధిలో తన ఇన్‌స్టా స్టోరీలను పోస్ట్ చేస్తోంది అని ఈ గొడవలోకి ప్రియాంకని తీసుకొచ్చారు. దీంతో ప్రియాంక స్పందిస్తూ.. హలో హీరో.. సెట్‌లో నువ్వు నాతో పంచుకునే కథలన్నీ నేనే లీక్ చేయాలనుకుంటున్నావా? మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఏసేస్తా అని సరదాగా రిప్లై ఇచ్చింది. దీనికి రాజమౌళి.. ప్రియాంక చోప్రా నటిస్తుందనే విషయాన్ని నువ్వు ఎందుకు బయటపెట్టావ్ మహేష్. నువ్వు సర్ప్రైజ్ ని నాశనం చేసావ్ అని ఫైర్ అయ్యారు.

Also Read : Chaitanya Rao : వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో కనీసం రెస్పెక్ట్ ఇవ్వలేదు.. ఏడుపొచ్చింది.. మధ్యలో వెళ్ళిపోతే ఫోన్ చేసి..

దానికి మహేష్ రిప్లై ఇస్తూ.. సర్ప్రైజా? మీ ఉద్దేశ్యంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక సర్ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నారా? అని అన్నాడు. దీనికి పృథ్వీరాజ్ స్పందిస్తూ.. రాజమౌళి సార్. నేను ఇలాగే హైదరాబాద్ వెకేషన్ కి తిరిగితే, నా ఫ్యామిలీ నన్ను అనుమానించడం స్టార్ట్ చేస్తారు అన్నాడు. దీంతో రాజమౌళి.. మహేష్ ఇప్పుడు నువ్వు అన్నీ నాశనం చేశావు అంటూ మరింత ఫైర్ అయ్యారు. దీనికి మహేష్ స్పందిస్తూ.. సరే ఒక సంధి చేసుకుందాం. ఇప్పటికే అందరికీ తెలిసిన ఏదో ఇక విషయాన్ని రేపు ప్రకటించండి. మీరు ఇప్పటికీ దాన్ని సర్ప్రైజ్ అని అనుకుంటే కష్టం అన్నట్టు రిప్లై ఇచ్చాడు.

రాజమౌళి దానికి.. ఓకే కానీ నువ్వు ఎక్కువ వ్యంగ్యంగా మాట్లాడినందుకు నీ కంటెంట్ లేట్ గా రిలీజ్ చేస్తాను అని అన్నారు. దీనికి పృథ్వీరాజ్.. నాకు తెలుసు సర్.. మీకు విలన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అని అంటే ప్రియాంక.. బెటర్ లక్ నెక్స్ట్ టైం మహేష్ అని రాసుకొచ్చింది. దీనికి మహేష్ ఓరి దీని ఏషాలో.. అంటూ రాజమౌళి లేట్ గా ఇచ్చినా బెస్ట్ ఇస్తాడు అని ఈ ట్వీట్ వార్ కి ముగింపు ఇచ్చాడు.

Also Read : Rashmika Mandanna : రెమ్యునరేషన్ వద్దన్న రష్మిక.. ఏకంగా డబల్ రెమ్యునరేషన్ ఇస్తున్న తెలుగు నిర్మాతలు..

SSMB29

దీంతో సినిమా టీమ్ కావాలనే ఇలా ప్రమోషన్ కోసం ట్వీట్స్ చేసారని తెలుస్తుంది. అలాగే SSMB29 నుంచి రావాల్సిన మొదటి అప్డేట్ లేట్ గా వస్తుందని రాజమౌళి చెప్పేసాడు. అది కవర్ చేయడానికి, ఫ్యాన్స్ ని కూల్ చేయడానికే ట్విట్టర్లో ఈ ట్వీట్ వార్ పెట్టాడని, రాజమౌళి తెలివితేటలు మామూలువి కావని ఫ్యాన్స్, నెటిజన్లు అంటున్నారు.