Champion : హమ్మయ్య శ్రీకాంత్ కొడుకు హీరోగా రెండో సినిమా వస్తుంది.. ‘ఛాంపియన్’ టీజర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే?

ఎట్టకేలకు ఇన్నాళ్లకు రోషన్ ఛాంపియన్ సినిమా గాడిలో పడింది. (Champion)

Champion : హమ్మయ్య శ్రీకాంత్ కొడుకు హీరోగా రెండో సినిమా వస్తుంది.. ‘ఛాంపియన్’ టీజర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే?

Champion

Updated On : November 1, 2025 / 11:45 AM IST

Champion : హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లిసందD సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతున్నా నెక్స్ట్ సినిమా ఇంకా రాలేదు. కొన్నాళ్ల క్రితం రోషన్ హీరోగా స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో ఛాంపియన్ అనే సినిమాని ప్రకటించారు. ఈ సినిమా ప్రకటించి కూడా మూడేళ్లు అవుతుంది.(Champion)

ఎట్టకేలకు ఇన్నాళ్లకు రోషన్ ఛాంపియన్ సినిమా గాడిలో పడింది. నేడు ఛాంపియన్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే బ్రిటిష్ కాలంలో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని, హీరో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అలాగే నిజాం బ్యాక్ డ్రాప్ లో కూడా కథ జరగనుందని, యాక్షన్ సీక్వెన్స్ లతో సాగనుందని తెలుస్తుంది.

Also Read : Rajamouli : పాపం 70 రోజులు కంటిన్యూగా చుక్కలు చూపించిన రాజమౌళి.. అడుక్కున్నా కనికరించలేదు..

ఛాంపియన్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. మీరు కూడా ఛాంపియన్ టీజర్ చూసేయండి..