Rajamouli : పాపం 70 రోజులు కంటిన్యూగా చుక్కలు చూపించిన రాజమౌళి.. అడుక్కున్నా కనికరించలేదు..

తాజాగా రాజమౌళి పెట్టిన కష్టం గురించి ప్రభాస్ చెప్పుకొచ్చాడు.(Rajamouli)

Rajamouli : పాపం 70 రోజులు కంటిన్యూగా చుక్కలు చూపించిన రాజమౌళి.. అడుక్కున్నా కనికరించలేదు..

Rajamouli

Updated On : November 1, 2025 / 10:02 AM IST

Rajamouli : రాజమౌళి పని రాక్షసుడు అని తెలిసిందే. తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చేంతవరకు ఆర్టిస్టులని, సాంకేతిక నిపుణులను కష్టపెడతాడు. ఈ విషయం ప్రభాస్, రానా, ఎన్టీఆర్, చరణ్.. ఇలా చాలా మంది ఆర్టిస్టులు అనేకసార్లు చెప్పారు. తాజాగా రాజమౌళి పెట్టిన కష్టం గురించి ప్రభాస్ చెప్పుకొచ్చాడు.(Rajamouli)

బాహుబలి ది ఎపిక్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్, రానా, రాజమౌళి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆసక్తికర విషయం చెప్పాడు.

Also Read : Tamannaah Bhatia : తమన్నా అందుకే విడిపోయిందా? ఇండైరెక్ట్ గా విజయ్ గురించి చెప్పిందా?

ప్రభాస్ మాట్లాడుతూ.. కాలకేయ వార్ షూటింగ్ సమ్మర్ లో పెట్టాడు. 70 రోజులు కంటిన్యూ షూట్ పెట్టారు. ఓ పక్కన ఫుల్ ఎండ, చెమటలు కారతాయి, యాక్షన్ సీక్వెన్స్ లు చాలా కష్టపెట్టాడు. అసలు ఎవరికీ హాలిడే ఇవ్వలేదు. నేను బాలికి వెళ్ళొస్తాను ఒక మూడు రోజులు గ్యాప్ ఇవ్వు, నా సీన్స్ లేని రోజుల్లో వెళ్తాను అన్నా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ టైంలో హోలీ పండగ వచ్చింది. హోలీ ఎవరైనా సెట్ లో చేసుకుంటే చంపేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆదివారాలు, సెలవులు ఏమి లేకుండా 70 రోజులు వరుసగా షూట్ చేసారు అని రాజమౌళి గురించి తెలిపారు.

రాజమౌళి దీనిపై మాట్లాడుతూ.. అయినా సెట్ లో కొంతమంది హోలీ చేసారు. నా దగ్గరికి వచ్చి హోలీ ఆడదాం అని అడిగితే చంపేస్తాను సెట్ లో కలర్స్ పడతాయి, విజువల్స్ మారిపోతాయి, షూటింగ్ కి కష్టం అని చెప్తే కాలకేయులు అంతా బ్లాక్ ఉంటారని బ్లాక్ కలర్ తెచ్చుకొని హోలీ ఆడారు అని అన్నారు. మొత్తానికి రాజమౌళి అందర్నీ బెస్ట్ అవుట్ ఫుట్ కోసం బాగా కష్టపెడతాడని మరోసారి రుజువైంది. అంత కష్టపెట్టిస్తేనే ఆ రేంజ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు దర్శకధీరుడు.

Also Read : NTR : హమ్మయ్య పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూట్ మళ్ళీ మొదలు.. ఎప్పట్నించి? ఎక్కడ?