Tamannaah Bhatia : తమన్నా అందుకే విడిపోయిందా? ఇండైరెక్ట్ గా విజయ్ గురించి చెప్పిందా?

తాజాగా తమన్నా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. (Tamannaah Bhatia)

Tamannaah Bhatia : తమన్నా అందుకే విడిపోయిందా? ఇండైరెక్ట్ గా విజయ్ గురించి చెప్పిందా?

Tamannaah Bhatia

Updated On : November 1, 2025 / 9:30 AM IST

Tamannaah Bhatia : 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా ఇంకా చేతి నిండా సినిమాలతో దూసుకుపోతుంది తమన్నా. కొన్నాళ్ల క్రితం తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారు అని అధికారికంగానే ప్రకటించారు. ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పడం, వీరి ప్రేమ గురించి చెప్పడం, ఒకర్నొకరు పొగడటం చేశారు. పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి.(Tamannaah Bhatia)

కానీ ఏమైందో ఏమో తెలీదు విజయ్ వర్మ – తమన్నా విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆ రిలేషన్ గురించి ఇద్దరూ ఎక్కడా మాట్లాడట్లేదు. అయితే తాజాగా తమన్నా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : NTR : హమ్మయ్య పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూట్ మళ్ళీ మొదలు.. ఎప్పట్నించి? ఎక్కడ?

ఎలాంటి మనుషులు అంటే మీకు ఇష్టం ఉండదు అని అడగ్గా తమన్నా సమాధానమిస్తూ.. నేను ఎవరినైనా సహిస్తాను కానీ మొహం మీదే అబద్ధాలు చెప్పేవాళ్లను మాత్రం సహించలేను. మాయమాటలు చెప్పి, పక్కనే ఉంటూ అబద్ధాలు చెప్తూ మనల్ని పిచ్చోల్ని చేసే వ్యక్తుల్ని నేను భరించలేను. రెగ్యులర్ గా అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని నేను హ్యాండిల్ చేయలేను అని చెప్పింది.

దీంతో ఈ కామెంట్స్ విజయ్ వర్మ మీదే చేసిందని, విజయ్ తమన్నాకు అబద్దాలు చెప్పాడని, అందుకే తనతో రిలేషన్ బ్రేక్ చేసుకుందని అనుకుంటున్నారు. ఇండైరక్టు గా విజయ్ గురించే తమన్నా ఇలా చెప్పిందని బాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతుంది.

Also Read : Vijay – Rashmika : నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఇద్దరూ ఒకే స్టేజిపై..? ఫ్యాన్స్ కి పండగే.. ఇప్పటికైనా చెప్తారా?