Vijay – Rashmika : నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఇద్దరూ ఒకే స్టేజిపై..? ఫ్యాన్స్ కి పండగే.. ఇప్పటికైనా చెప్తారా?

నిశ్చితార్థం తర్వాత కూడా రష్మిక - విజయ్ ఎక్కడా దీని గురించి మాట్లాడట్లేదు. (Vijay - Rashmika)

Vijay – Rashmika : నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఇద్దరూ ఒకే స్టేజిపై..? ఫ్యాన్స్ కి పండగే.. ఇప్పటికైనా చెప్తారా?

Vijay - Rashmika

Updated On : November 1, 2025 / 7:29 AM IST

Vijay – Rashmika : గత కొన్నేళ్లుగా టాలీవుడ్ రూమర్ కపుల్ గా ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అని వైరల్ అయిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయం వాళ్ళు అధికారికంగా ప్రకటించకపోయినా విజయ్, రష్మిక టీమ్ మీడియాకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి వేళ్ళకు కొత్త రింగ్స్ కూడా కనబడటంతో అంతా ఫిక్స్ అయ్యారు.(Vijay – Rashmika)

అయితే నిశ్చితార్థం తర్వాత కూడా రష్మిక – విజయ్ ఎక్కడా దీని గురించి మాట్లాడట్లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు నవంబర్ 7న రానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరవుతాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

Also Read : Mass Jathara Review : ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ.. రైల్వే పోలీస్ గా రవితేజ ఏం చేసాడు?

దీంతో నిశ్చితార్థం తర్వాత మొదటిసారి విజయ్ – రష్మిక కలిసి ఒకే స్టేజిపై కనిపించబోతున్నారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇదే ఇజమైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ – రష్మిక ఏం మాట్లాడతారు? ఇప్పటికైనా అధికారికంగా వాళ్ళ పెళ్లి విషయం చెప్తారా? ఇద్దరు కలిసి స్పెషల్ గా ఫోటోలకు పోజులిస్తారా అనే చర్చ నడుస్తుంది.