NTR : హమ్మయ్య పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూట్ మళ్ళీ మొదలు.. ఎప్పట్నించి? ఎక్కడ?
ఇటీవల ఎన్టీఆర్ ఓ యాడ్ షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. (NTR)
NTR
NTR : ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ఫ్యాన్స్ ని నిరాశపరిచినా తర్వాత రాబోయే డ్రాగన్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ – రుక్మిణి వసంత్ జంటగా డ్రాగన్ భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది.(NTR)
ఇటీవల ఎన్టీఆర్ ఓ యాడ్ షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. కనీసం ఓ మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ చెప్పినట్టు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగానే ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకు బ్రేక్ పడింది. అలాగే ఇటీవల ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మధ్య స్క్రిప్ట్ విషయంలో విబేధాలు వచ్చాయని, కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని, అందుకే షూట్ వాయిదాపడిందని రూమర్స్ కూడా వచ్చాయి.
Also Read : Mass Jathara Review : ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ.. రైల్వే పోలీస్ గా రవితేజ ఏం చేసాడు?
ఎట్టకేలకు ఇన్ని రోజులు బ్రేక్ పడిన డ్రాగన్ షూట్ మొదలు కాబోతుందనే వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది. డ్రాగన్ సినిమా టీమ్ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ గాయం నుంచి పూర్తియా కోలుకున్నాడని, మళ్ళీ ఫిట్ గా తయారయ్యారని, స్క్రిప్ట్ లో కూడా అంతా ఫైనల్ అయిందని తెలుస్తుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ నవంబర్ మూడో వారం నుంచి చేయడానికి ప్లాన్ చేసారు. ఇప్పటికే దీనికి కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫాస్ట్ గా జరుగుతుందని, యూరప్ లో ఈ షెడ్యూల్ షూటింగ్ జరగబోతుందని సమాచారం.
ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక డ్రాగన్ సినిమాని చెప్పిన టైం కి 2026 జూన్ 25 న రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఇటీవల తెలుసు కదా సినిమా ప్రమోషన్స్ లో మరోసారి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
