Chaitanya Rao : వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో కనీసం రెస్పెక్ట్ ఇవ్వలేదు.. ఏడుపొచ్చింది.. మధ్యలో వెళ్ళిపోతే ఫోన్ చేసి..

నటుడు చైతన్య రావు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో తాను ఫేస్ చేసిన ఇబ్బందిని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.(Chaitanya Rao)

Chaitanya Rao : వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో కనీసం రెస్పెక్ట్ ఇవ్వలేదు.. ఏడుపొచ్చింది.. మధ్యలో వెళ్ళిపోతే ఫోన్ చేసి..

Chaitanya Rao

Updated On : November 1, 2025 / 1:50 PM IST

Chaitanya Rao : పెద్ద సినిమాల షూటింగ్స్ సమయంలో చాలా బిజీబిజీగా ఉంటుంది. చిన్న నటులు, మీడియం నటులు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తే వారిని కూడా ఎక్కువగా పట్టించుకోరు. తాజాగా నటుడు చైతన్య రావు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో తాను ఫేస్ చేసిన ఇబ్బందిని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.(Chaitanya Rao)

చైతన్య రావు ఎప్పట్నుంచో సినిమాలు చేస్తున్నా 30 వెడ్స్ 21 సిరీస్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ సిరీస్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.

Also Read : Rashmika Mandanna : రెమ్యునరేషన్ వద్దన్న రష్మిక.. ఏకంగా డబల్ రెమ్యునరేషన్ ఇస్తున్న తెలుగు నిర్మాతలు..

Chaitanya Rao

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చైతన్య రావు మాట్లాడుతూ.. వకీల్ సాబ్ సినిమాలో ఒక చిన్న రోల్ చేసాను. అది ఒక్క రోజే షూటింగ్. నాకు కాల్ వచ్చింది ఒక పాత్ర ఉందని. పవన్ కళ్యాణ్ గారి సినిమా అని నేను వెళ్ళాను. ఆయన సినిమాలో ఒక్క సీన్ చేసినా చాలు అనుకున్నాను. అప్పటికే నేను కొన్ని సినిమాలు చేశాను. పెద్ద పాత్రలే చేశాను. గుర్తింపు ఉంది. అక్కడికి వెళ్లిన తర్వాత ట్రీట్మెంట్ చాలా బ్యాడ్ గా ఉంది. కనీసం రెస్పెక్ట్ లేదు. నన్ను కూడా అందరు జూనియర్ ఆర్టిస్ట్ లాగే చూసారు. నన్ను కొంతమంది మధ్యలో నిలబెట్టి సీరియస్ గా చూడాలి అన్నారు.

ఉదయం నుంచి అలాగే ఉంటే సాయంత్రానికి కెమెరా మా దగ్గరికి వచ్చింది. చిన్న బ్రేక్ వచ్చింది. నాకు చాలా ఏడుపు వచ్చింది. ఏంటి ఇది, ఎందుకు ఒప్పుకున్నాను, ఒక్క డైలాగ్ అన్నా ఉంటుంది అనుకున్నా, కానీ అదికూడా లేదు. ట్రీట్మెంట్ కూడా బ్యాడ్ గా ఉంది అని నేను వెళ్ళిపోయాను. దాని కోసం కార్ లో వెళ్ళానా అని అనుకున్నాను. అసలు డైరెక్టర్ కి నేను ఉన్నాను అని కూడా తెలీదు. నేను వెళ్లి కార్ లో కూర్చొని ఏడ్చాను. వెళ్లిపోతుంటే ఆ సీన్స్ లోనే ఉన్న కృష్ణ చైతన్య కాల్ చేస్తే నాకు ఇలా ఉంది అని చెప్పి వెళ్ళిపోతున్నాను అన్నాను. అక్కడ ఒక కో డైరెక్టర్ ఈ అబ్బాయి ఎక్కడ అని నన్ను వెతికాడు.

Also Read : Mega – Allu Family : మెగా – అల్లు ఫ్యామిలీ ఫొటోలు వైరల్.. బన్నీ – చరణ్ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటోలో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..

అప్పటికే నేను బయటకు వెళ్ళిపోయాను. కృష్ణ చైతన్య మళ్ళీ ఫోన్ చేసి నీ కోసం వెతుకుతున్నారు రా అని చెప్తే నేను వద్దులే అనుకున్నా. కానీ చైతన్య బాగోదు అని గట్టిగా చెప్పి రమ్మనడంతో వెళ్ళాను. అప్పుడు వెళ్ళాక నాకు క్లోజ్ లో ఒక డైలాగ్ పెట్టారు. సినిమాలో నాకు ఆ క్లోజ్ డైలాగ్ పడింది. ఆ రోజు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా 200 మందితో లైన్ లో నిల్చొని డబ్బులు తీసుకున్నాను. అది నాకు చాలా బాధ వేసింది. ఇప్పటికి మా ఫ్రెండ్స్ హాయ్యెస్ట్ పైడ్ జూనియర్ ఆర్టిస్ట్ అని సరదాగా అంటారు. కానీ ఆ సినిమాతో నాకు పెద్ద సినిమా పవర్ తెలిసింది. ఆ ఒక్క క్లోజ్ డైలాగ్ వల్ల వకీల్ సాబ్ రిలీజ్ అయ్యాక నాకు చాలా ఫోన్స్ వచ్చాయి. అప్పటివరకు ఎన్ని చేసినా రాలేదు అని తెలిపాడు.