Parineeti Chopra: తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. సోషల్‌ మీడియాలో స్పెషల్‌ పోస్ట్‌

బాలీవుడ్ బ్యూటీ ప‌రిణీతి చోప్రా (Parineeti Chopra) గుడ్‌ న్యూస్ చెప్పారు. తాను తల్లికాబోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటిచారు.

Star beauty Parineeti Chopra announces she is going to be a mother

Parineeti Chopra: బాలీవుడ్ బ్యూటీ ప‌రిణీతి చోప్రా (Parineeti Chopra) గుడ్‌ న్యూస్ చెప్పారు. తాను తల్లికాబోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటిచారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు. “మా చిన్ని ప్రపంచం.. త్వరలో మా జీవితాల్లోకి రాబోతోంది’ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు 1+1 = 3 అని రాసి ఉన్న ఫోటోను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. దాంతో పరిణీతి అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Toxic: యష్ టాక్సిక్ కోసం హాలీవుడ్ స్టెంట్ మెన్.. నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్ లో యష్

ఇక బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2023 సెప్టెంబర్ 24వ తేదీన ఉదయ్‌పుర్‌ లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా చెల్లెలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు పప్రియాంక చోప్రా. 2011లో విడుదలైన ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బాల్‌’ సినిమా పరిణీతి చోప్రా మొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస సినిమాలు చేశారు పరిణితి చోప్రా.