Harish Shankar : ఫుల్ టైం నటుడిగా మారుతున్న డైరెక్టర్ హరీష్ శంకర్..? ఆ హీరో సినిమాలో కీలక పాత్రలో..

దర్శకుడు హరీష్ శంకర్ ఫుల్ టైం నటుడిగా మారబోతున్నాడని సమాచారం.

Star Director Harish Shankar Turning as Actor with Suhas Movie

Harish Shankar : ఇప్పటికే పలువురు దర్శకులు నటులుగా మారిన సంగతి తెలిసిందే. గతంలో కూడా చాలా మంది దర్శకులు నటులుగా, గెస్ట్ పాత్రల్లో సినిమాల్లో మెప్పించారు. ఇప్పుడు మరో దర్శకుడు హరీష్ శంకర్ ఫుల్ టైం నటుడిగా మారబోతున్నాడని సమాచారం. గబ్బర్ సింగ్, మిరపకాయ్, దువ్వాడ జగన్నాధం.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్.

గతంలో హరీష్ శంకర్ నిన్నే ఇష్టపడ్డాను, అందరివాడు, ఏ ఫిలిం బై అరవింద్, నేనింతే, నిప్పు.. లాంటి పలు సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో కనిపించి మెరిపించాడు. ఇప్పుడు ఓ సినిమాలో కాస్త కీలక పాత్ర చేస్తున్నాడు. యువ హీరో సుహాస్ వరుస సినిమాలతో హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. సుహాస్ హీరోగా త్వరలో ‘ఓ భామ అయ్యో రామ’ అనే సినిమాతో రాబోతున్నాడు.

Also Read : Vishwak Sen Laila Sequel : ‘లైలా’ సీక్వెల్ లేనట్టేగా..? మరి సీక్వెల్ కోసం చేసిన షూటింగ్, ఆ సీన్స్ సంగతి ఏంటి?

వీ ఆర్ట్స్‌ బ్యానర్ పై హరీష్‌ నల్ల నిర్మాణంలో రామ్ గోధల దర్శకత్వంలో సుహాస్, మాళవిక మనోజ్ జంటగా ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర హరీష్ శంకర్ చేస్తేనే బాగుంటుందని మేకర్స్‌ ఆయన్ని ఒప్పించి ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ ఇటీవలే పూర్తిచేశారు. తాజాగా హరీష్ శంకర్ తమ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఓ చిన్న షూటింగ్ వీడియో రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సుహాస్‌ కెరీర్‌కు మరో మైలురాయిగా ఈ సినిమా నిలుస్తుంది. ఈ సినిమాలో సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతో పాటు అంతకు మించిన ఫన్‌ ఉంటుంది. హరీష్‌ శంకర్‌ గారు అడ్గగానే మా సినిమాలో అతిథి పాత్రను చేసినందుకు కృతజ్ఞతలు. ఈ వేసవిలో ఓ భామ అయ్యో రామ సినిమా రిలీజ్ చేస్తాం అని ప్రకటించారు.

Also See : Icon Star Allu Arjun : అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటోలు చూశారా..? ఏమున్నాడ్రా బాబు.. ఐకాన్ స్టార్ కొత్త లుక్ వైరల్..

ఇటీవల హరీష్ శంకర్ ఓ సినిమా ఈవెంట్లో.. నేను కూడా నటుడిగా మారాలనుకుంటున్నాను, చాన్సులు వుంటే చెప్పండి అని సరదాగా అన్నారు. అలా అన్న కొన్ని రోజులకే ఇలా ఓ సినిమాలో కీలక పాత్ర ప్రకటించడంతో హరీష్ శంకర్ సీరియస్ గానే తీసుకొని ఫుల్ టైం నటుడిగా మారబోతున్నారు అని టాలీవుడ్ భావిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో నటుడిగా వస్తాడేమో చూడాలి. ఇక దర్శకుడిగా ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో నిరాశ పరిచినా ప్రస్తుతం చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది.