Item Songs: ఐటెం సాంగ్ ఉందా.. ఊ ఊ అనేదే లేదంటున్న స్టార్ హీరోయిన్స్!

ఇప్పుడు ఐటమ్ సాంగ్ కు.. అదే స్పెషల్ సాంగ్ కి ఓ లెక్కుంది. ఒకప్పటిలా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్స్ కాదు.. స్టార్ డం అనుభవిస్తున్న వాళ్లు కూడా మాస్ సాంగ్ కి ఊ అంటున్నారు.

Item Songs

Item Songs: ఇప్పుడు ఐటమ్ సాంగ్ కు.. అదే స్పెషల్ సాంగ్ కి ఓ లెక్కుంది. ఒకప్పటిలా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్స్ కాదు.. స్టార్ డం అనుభవిస్తున్న వాళ్లు కూడా మాస్ సాంగ్ కి ఊ అంటున్నారు. ఊ ఊ చెప్పకుండా హ్యాజ్ రెమ్యునరేషన్ గ్లామర్ గర్ల్స్ కి ఆఫర్ చేస్తున్నారు మేకర్స్. అందులో పాట సూపర్ హిట్టయితే.. లెవెల్ వేరే ఉంటుంది. అందుకే స్టార్ హీరోయిన్స్ కూడా ఐటం సాంగ్స్ పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. హై రెమ్యునరేషన్.. సూపర్ పాపులారిటీ.. బంపర్ హిట్టయితే భలే ఛాన్స్ లు.. ఇప్పుడీ లెక్కమీదే స్టార్ హీరోయిన్స్ స్పెషల్ స్టెప్పులేసేందుకు సై అంటున్నారు.

Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ దూకుడు.. వచ్చే ఏడాది కూడా నాదే!

రీసెంట్ పుష్పనే తీసుకోండి. ఫస్ట్ టైమ్ సమంత ఐటెం సాంగ్ చేసిందంటే అంతా షాక్ అయ్యారు. స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ ఎందుకు చేస్తుందనుకున్నారు. కానీ చివరికి బ్లాక్ బస్టర్ కొట్టి.. సిజ్లింగ్ సాంగ్ ఆప్ ది ఇయర్ గా ట్రెండ్ చేసింది సామ్ సాంగ్. సామ్ లెక్కలు సామ్ వి. పర్సనల్ విషయాలతో విసిగిపోయిందో.. సుకుమార్ అడిగారని ఒప్పేసుకుందో ఊ అనేసింది. అసలు ఊ ఊ అనే ఛాన్స్ ఇవ్వకుండా మేకర్స్ కూడా బాగానే ముట్టజెప్పారని అన్నారు. పాట ఫుల్ గా వైరల్ అయిపోయి సామ్ కి లక్కీ ఛార్మ్ ను తెచ్చిపెట్టింది. ఇప్పటికే సౌత్ టు నార్త్ ఫుల్ ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ కు తారక్ – కొరటాల ప్రాజెక్ట్ తో పాటూ మహేశ్ – త్రివిక్రమ్ సినిమాలోనూ లీడ్ రోల్ అవకాశం ఇచ్చేలా ఉన్నారు.

Malaika Arora: ఈ వయసులో హైహీల్స్ అవసరమా.. మలైకాకు నెటిజన్ల ట్రోలింగ్!

గతంలో ఐటమ్ సాంగ్ చేయాలంటే వాటి కోసం స్పెషల్ గ్లామర్ గాళ్స్ ఉండేవారు. సిల్క్ స్మిత, జయమాలిని, అనురాధ లాంటి ఆర్టిస్టులు నటనతో పాటు స్పెషల్ గా ఐటెం సాంగ్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు బాగానే హీటెక్కించారు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. దీంతో హీరోయిన్స్ కాస్త ఐటెం భామలుగా మారిపోతున్నారు. బాలీవుడ్ లో ఫస్ట్ ఈ పద్ధతి మొదలైంది. టాప్ ఫాంలో ఉన్నప్పుడే కరీనా కపూర్, కత్రినా కైఫ్, దీపికా పదుకోన్ లాంటి హీరోయిన్స్ ఐటమ్ పాటలు చేసారు. ఇప్పుడున్న బాలీవుడ్ యంగ్ గర్ల్స్ కూడా హీరోయిన్ గా ట్రై చేస్తూనే.. ఛాన్స్ వస్తే స్పెషల్ నంబర్స్ చేసేస్తున్నారు.

Samantha: టాలీవుడ్ టూ హాలీవుడ్.. టాప్ గేర్‌లో దూసుకుపోతున్న సామ్!

గతంలో రాశి, రంభ, రమ్యకృష్ణ లాంటి వాళ్ళు కూడా స్పెషల్ సాంగ్స్ చేసారు. కానీ వాళ్ళు హీరోయిన్ గా ఫేమ్ తగ్గిన తర్వాత షురూ చేసారు. సౌందర్య లాంటి హీరోయిన్ మాత్రం కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలోనే స్పెషల్ పాటలో కనిపించారు. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ మొదలుపెట్టింది మాత్రం శ్రియ‌. వరస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే రామ్ ఫస్ట్ మూవీ ‘దేవదాసు’లో ఐటెం సాంగ్ చేసి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మున్నా, తులసి, కొమరం పులి సినిమాలలో మెరపులా మెరిసింది.

Allu Arjun: నువ్వు లేక నేను లేను.. సుకుమార్‌ను తలచుకొని ఏడ్చేసిన బన్నీ!

కాజల్ స్టార్ గా కొనసాగుతున్నప్పుడే తారక్ తో స్పెషల్ గా ఆడిపాడింది. పక్కా లోకల్ అంటూ జనతా గ్యారెజ్ లో మెప్పించింది. హన్సిక కూడా ప్రభాస్ బిల్లాలో స్టెప్పులేసింది. హీరోయిన్ తమన్నా కూడా స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే అల్లుడు శీను, కేజీఎఫ్, జై లవకుశ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. రీసెంట్ గా వరుణ్ తేజ్ గని సినిమాలో కూడా ఆడిపాడింది తమన్నా.

Nabha Natesh: నిషా కళ్ళ నభా.. నీ అందం రోజురోజుకూ పెరుగుతుందా?!

ప్రస్తుతం తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే కూడా ‘రంగస్థలం’ సినిమాలో జిగేలు రాణి ఐటెం సాంగ్ తో కుర్రకారుని హీటెక్కించింది. ఆ పాట తర్వాతే పూజా హెగ్డేకి తెలుగులో అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. ఇక సలార్ బ్యూటీ శృతీ హాసన్ సైతం మహేశ్ సరసన ఆగడులో స్పెషల్ సాంగ్ లో నటించింది. సీనియర్ స్టార్ ఛార్మి ‘భాయ్’ సినిమాలో గరం ఛాయ్ అని రెచ్చిపోయింది. జేజమ్మ అనుష్క కూడా స్పెషల్ నంబర్స్ చేసింది. స్టాలిన్ మూవీలో చిరూతో, సోగ్గాడే చిన్ని నాయనాలో నాగ్ తో డాన్స్ చేసింది అనుష్కా.

Pan India Films: మారిన రూల్.. బాలీవుడ్‌కి బ్యాండ్ బజాయిస్తున్న టాలీవుడ్!

వేరే భాషల్లో కూడా ఐటమ్ సాంగ్స్ తో పాపులర్ అవ్వొచ్చు. ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. ఇక ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ లో దాదాపు సగం పైగా ఒక ఐటెం సాంగ్ కి తీసుకోవచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఫేమ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదింస్తున్నారు స్టార్ హీరోయిన్స్. ఇలాగే జాతిరత్నాలుతో 2021లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్డుల్లా…ఎండిగ్ లో కూడా బంగార్రాజుతో అంతే హీట్ పెంచేసింది.

Balakrishna: బాలయ్య ఓపెన్ ఆఫర్స్.. అందుకొనే దర్శకులెవరో?

యాంకర్ అనసూయ కూడా ఈమద్య బాగానే స్పెషల్ సాంగ్స్ చేసేస్తుంది. భోళాశంకర్ సినిమాలో చిరూ సరసన రష్మీ డాన్స్ చేస్తుందని అంటున్నారు. ఆచార్యలో చిరూ, చరణ్ లతో హీరోయిన్ రెజీనా స్పెప్పులేసిందని టాక్. వీళ్లతో పాటూ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయడానికి అంజలి, ప్రియమణి లాంటి వాళ్లు రెడీగానే ఉంటారు. వీళ్లే కాకుండా అవసరమైతే బాలీవుడ్ నుంచి కూడా తెలుగు పాటల్లో స్పెషల్ గా కనిపించడానికి వచ్చేస్తున్నారు గ్లామర్ క్వీన్స్.

ట్రెండింగ్ వార్తలు