Stranger Things Millie Bobby Brown engaged at 19 age with Jake Bongiovi
Stranger Things : ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things) సిరీస్ అందరు చూసే ఉంటారు. ఇప్పటికే 5 సీజన్లతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుగా నిలిచిన ఈ సిరీస్ లాస్ట్ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ ఎలెవన్ క్యారెక్టర్ లో నటించిన మిల్లీ బాబీ బ్రౌన్ (Millie Bobby Brown) టీనేజ్‌లోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతుంది. 19 ఏళ్ళ వయసు ఉన్న ఈ హాలీవుడ్ యాక్ట్రెస్ ప్రముఖ అమెరికన్ సింగర్ జాన్ బన్ జోవి (Jon Bon Jovi) కొడుకు జేక్ బొంగివోవి (Jake Bongiovi) తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.
Naatu Naatu : ఇంకా తగ్గని నాటు నాటు క్రేజ్.. వైరల్ అవుతున్న బేస్ బాల్ స్టేడియం!
వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కొన్నాళ్లుగా హాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. 2021 లో వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలను తమ సోషల్ మీడియాలో ప్రేమ కామెంట్స్ తో షేర్ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి ప్రేమ వార్తలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ ఏడాది (2023) న్యూ ఇయర్ టైంలో మిల్లీ బ్రౌన్.. తన ఇన్‌స్టాలో జేక్ ఫోటో షేర్ చేస్తూ.. పార్టనర్ ఫర్ లైఫ్ అనే కాప్షన్ తో వారి ప్రేమ నిజమే అంటూ హింట్ ఇచ్చింది. తాజాగా ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
మిల్లీ బాబీ బ్రౌన్ కి 19 ఏళ్ళ వయసు అయితే, జేక్ బొంగివోవికి 20 ఏళ్ళ వయసు. టీనేజ్ లోనే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతుండడంతో నెట్టింట వైరల్ గా మారింది. జస్ట్ 19 అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్ ఈ ఏడాది ఆగష్టులో వచ్చే అవకాశం ఉంది.